320
ఆత్మవిచారము
[8 వ
హింసచేయుస్వభావమున్న యెడల అందుకు కారణమగు దేహాభిమానమును వదలుటవల్ల హింసను జయించుము. ఇతరులవలన దుఃఖముగాని బాధగాని సందర్భించుననిన వారియందు కృపచూపుటచేత వారివల్ల కలుగు బాధను జయించుము. దేహపీడలను ప్రాణాయామాదులవల్ల జయించుము. నిద్రయను ప్రమాదమును సాత్త్వికాహారమువల్ల జయించుము. రజోగుణ తమోగుణంబులను సత్త్వగుణముచేతను సత్త్వగుణమును ఉపశమము చేతను జయించుము. ఉపశమమనగా "సర్వం బ్రహ్మమాత్రం" అను విచారజన్యజ్ఞానము. పై చెప్పిన అన్నిటినిని గురువులవారి యందు నిశ్చలభక్తిచేసి సంపాదించుము. జ్ఞానదీపమునిచ్చు గురువు సాక్షాద్భగవత్స్వరూపుడుగాని సామాన్యమనుష్యుడుకాడు అను నిశ్చయజ్ఞానము లేనివాని చదువు నిష్ఫలంబు.
ఈ విషయములను ప్రమాదరాహిత్యముతోను సూక్ష్మబుద్ధితోను విమర్శించి బాగుగ నభ్యసించువారికి కాలక్రమమున శీలము సాధ్యము. ఇందులో నొక విశేషమున్నది. కృపయా భూతజం దుఃఖం" అని చెప్పియున్నది. మనకు దుఃఖము కలుగజేయువారియందు కృపచూపవలెనట. ఇది లోకులు నవ్వతగిన విషయము. దుఃఖము కలుగచేసినవారికి ప్రతిదుఃఖము కలుగచేయక వారియందు కృపచూపవలెనట. నిశ్చయమే. లోకులధర్మమెట్లుండినను ప్రవృత్తిమార్గయాత్రచేయుచు "బ్రహ్మావలోకధిషణు" లై నివృత్తిమార్గ యాత్రయం దాసక్తి చెందిన జీవాత్మలు సాధారణజనులు కారు. వారు అసాధారణులు. వారి ధర్మము అసాధారణధర్మము.