12
ఆత్మవిచారము
[2 వ
కాత్యానుమేయా సుధియైవ మాయా
యయా జగత్సర్వమిదం ప్రసూయతే ॥
సన్నాప్యసన్నా ప్యుభయాత్మికా నో
చిన్నాప్యచిన్నా ప్యుభయాత్మికా నో ।
పాంగా ప్యనంగా ప్యుభయాత్మికా నో
మహాద్భుతా౽ నిర్వచనీయ శక్తిః ॥
అవ్యక్తమని పేరుగలదియు, అనాదియు, త్రిగుణాత్మికమైనదియు నగు మాయవలననేకదా యీ జగత్తంతయు సృష్టింప బడుచున్నది. ఈ మాయ ఇట్టి స్వభావము కలదని చెప్పుటకు సాధ్యము కాదు. సత్ కాదు; అసత్ కాదు; రెండును (సదసత్తులు) కలిసినదియు కాదు. చిత్ కాదు; అచిత్ కాదు; రెండును ( చిదచిత్తులు) కలిసినదియు కాదు. అంగసహిత మైనదికాదు; అంగములేనిది కాదు; ఈ రెండును కలిసినదికూడ కాదు. ఇది మహాద్భుతమైనదియు, మాటలతో తెలియచేయుట కసాధ్యమును అగు శక్తి.
పరమేశ్వరునియొక్క శక్తి ఇట్టి అద్భుతగుణములు కలిగినది. దీనినే
ఐశ్వర్యయోగాత్
అని ఈ అధ్యాయాదిన ముద్రించియుండు శ్లోకమునందుండు "ఐశ్వర్య” అనుపదముచే సూచింపబడినది. సత్వరజస్తమోగుణములు మాయయందు పుట్టినవి. ఇది మొదలు గుణముల చేష్టల ఆరంభము. ఇది మొదలు స్త్రీలింగపుల్లింగ భేదములు. ఇది మొదలు పరాప్రకృతి అపరాప్రకృతి యనుభేదముల యారంభము.