అధ్యా 8]
శీలము
319
కృపయా ఛూతజం దుఃఖం దైవం జహ్యాత్సమాధినా ।
ఆత్మజం యోగవీర్యేణ నిద్రాం సత్త్వనిషేవయా ॥
రజస్తమశ్చ సత్త్వేన సత్త్వం చోపశమేన చ ।
ఏతత్సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యంజసా జయేత్ ॥
యస్య సాక్షాద్భగవతి జ్ఞానదీపప్రదే గురౌ ।
మర్త్యాసద్ధీశ్రుతం తస్య సర్వం కుంజరశౌచవత్ ॥
(శ్రీమద్భాగవతము, సప్తమస్కంధము, 15 వ ఆధ్యా)
శ్రీమద్భాగవతము సప్తమస్కంధమునందు శ్రీనారదమహామునిగారి ఉపదేశము పైన వ్రాయబడినది. దానిని మాత్రము తెనుగున వ్రాసినట్టైతే చాలును. "కామమునకు కారణంబైన సంకల్పవర్జనము వల్ల కామమును జయించుము. క్రోధకారణంబైన కామమును వర్జించి క్రోధమును జయించుము. దృశ్యపదార్థంబులెల్లయు
ననర్థకారణంబులే యని విమర్శించురీత్యా లోభమును జయించుము. తత్త్వవిచారముచేసి భయమును మానుము. (భయము అనగా జ్ఞానమార్గమునందు నడుచునపుడు అపరిగ్రహము, వైరాగ్యము మొదలగు ధర్మములను అభ్యసించితే నే నెట్లు బ్రతుకగలను అను భీతి.) శోకమోహములను ఆత్మానాత్మ
వివేకజ్ఞానమువల్ల జయించుము. దంభమును జయించుటకు గా సాధువులను సేవించవచ్చును. లేక తనకంటె నధికమైన ఐశ్వర్యముగలవారినిచూచి, వీరి ఐశ్వర్యమునకు ఎదుట నా ఐశ్వర్యము ఏమాత్రము అని విచారించి, నా దంభమునకు న్యాయము లేదు, అని సిగ్గుచెంది వదలవచ్చును. యోగమునకు ప్రత్యవాయము లగు లోకవార్తలను మానము నభ్యసించి జయించుము.