అధ్యా 8]
శీలము
317
మంకిఉపాఖ్యాన మని యొకటి శ్రీమహాభారతమందున్నది. అందులో కామమును త్యజించిన వివరమును చెప్పియున్నది.
కామ జనామి తే మూలం సంకల్పా త్త్వం హి జాయసే ।
న త్వాం సంకల్పయిష్యామి తస్మా న్మే న భవిష్యసి ॥
(శ్రీమహాభారతము, శాంతి. 177 అధ్యా.)
కామమా, నీ పుట్టినిల్లు నేనెరుగుదును ; సంకల్పమువల్ల పుట్టుదువు; కనుక నిన్ను సంకల్పించను; అందువలన నీకు పుట్టుక లేక పోవును ; అని చెప్పియున్నది.
సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధో ణిజాయతే ।
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ॥
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ప్రణశ్యతి ॥
(భ. గీ. 2 వ ఆధ్యా.)
లోభాత్ క్రోధః ప్రభవతి క్రోధా ద్ద్రోహః ప్రవర్తతే ।
ద్రోహేణ నరకం యాతి తస్మా ల్లోభం పరిత్యజేత్ ॥
(శివతత్త్వరత్నాకరము.)
ఈ పై చెప్పిన రెండు గమకములయందును కొన్ని దుర్గుణములకు కారణములు చెప్పబడియున్నవి. కారణములను నిరాకరించిన యెడల ఆ కారణములవల్ల పుట్టగల కార్యములు పుట్టవు. ఇది యొక విధమైన ప్రయత్నము.
శౌచము అను విషయమును 310 వ పుటయందు వ్రాసినపుడు "ఆంతరం రాగద్వేషమోహగర్వకాఠిన్యాది మలానాం తత్ప్రతికూలగుణావష్టంభేన క్షాళనం” అని వ్రాయబడియె. అం