314
ఆత్మవిచారము
[8 వ
దీనికి అర్థము: నేను నందవ్రజంబునకు వెళ్లి మహానుభావులైన రామకృష్ణులను దర్శించి లోకహితుండైన శ్రీకృష్ణుని పాదారవిందంబులం బడియెద. అపుడు ఆ జగన్నాథుడు తన్నాశ్రయించిన వారికి అభయంబునొసంగు తనయొక్క కరారవిందంబును తన పాదంబులంబడియున్న నాశిరంబుపై నునుచును. మహాత్ములగు బలిచక్రవర్తిమొదలగువారు ఏ పాదారవిందములను పూజించిరో ఆ పాదారవిందములపై పడియెదను. సర్వహృదయాంతర్వరియై నిర్మలదృష్టిచే నఖిలభూతముల బాహ్యాంతరభావములనెరుగు నమ్మహాఘనుండు కంసునిపంపున పోయినందున కంసుని భృత్యుడని నాపై ద్వేషబుద్ధిచూపడని నమ్ముదును. తనపాదములకడ చాగిలపడి లేచి నిలిచి చేతులుజోడించి అంజలి బద్ధుండైన నన్ను కరుణారస శోభాయమానంబైన చిరునవ్వుగాన్పించు ప్రేమదృష్టితో చూచునుకదా. అందువలన నాపాపములెల్ల నశించినందున సందేహరహితుడనై పరమానందభరితుండయ్యెదనో. అత్యంతస్నేహితుడను, బంధువుడను, అనన్యభక్తుడను, అగు నన్ను ఆ దయానిధియైన వాసుదేవుండు తన దీర్ఘబాహువులంజాచి కౌగలింపడే? ఆహా! అపుడు నేను పరమపావనుండగుదునే. నా కర్మబంధమెల్ల వీడదా. అట్లు కౌగలించి కృతాంజలియైన నన్ను నాయనా, అక్రూరా యని పిలుచును గదా. అపుడుకదా నాజన్మంబు ఫలవంతంబగు. శ్రీకృష్ణునిచే నాదరింపబడని వాని జన్మంబు తుచ్ఛంబే కదా. ఈ విధమ్మున భక్తాగ్రగణ్యుండగు నక్రూరుండు తన మదిన్ మనోరాజ్యయుతంబైన కోరికలగోరుచు మార్గయానంబుగావించె. అక్రూరుని మననంబంతయు మనో రాజ్యంబే. ఇదివరకు నడువనిదియు నడిచిన