Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 8]

శీలము

313

యున్నది. జ్ఞానవాసిష్ఠము, ఉత్పత్తిప్రకరణమునందు లవణు డనువాడు చేసిన మానసిక యజ్ఞము మనో రాజ్యము అనదగును. మరియును శ్రీమద్భాగవతమునందు, దశమస్కంధమునందు శ్రీ కృష్ణబలరాములను మధురాపురంబునకు తోడితెచ్చుటకు అక్రూరుడు పోయినపుడు త్రోవనడుచుచు తనలో తాను మాటాడు కొనినవిధము.

అప్యంఘ్రీమూలే పతితస్య మే విభు శ్శిరస్యధాస్యన్ నిజహస్తపంకజం । దత్తాభయం కాలభుజంగరంహసా ప్రోద్వేజితానాం శరణైషిణాం నృణాం ॥

సమర్హణం యత్ర విధాయ కౌశిక స్తథా బలి శ్చాప జగత్త్ర యేంద్రతాం । యద్వా విహారే ప్రజయోషితాం శ్రమం స్పర్శేన సౌగంధికగంధ్యపానుదత్ ॥

న మయ్యుపైప్యత్యరిబుద్ధి మచ్యుతః కంసస్య భృత్యః ప్రహితోపి విశ్వదృక్ । యోంతర్బహి శ్చేతస ఏతదీహితం క్షేత్రజ్ఞ ఈక్షత్యమలేన చక్షుసా ॥

ఆప్యంఘ్రిమూలే౽వహితం కృతాంజలిం మా మిక్షితా సస్మితయార్ద్రయా దృశా । సపద్యపధ్యస్త సమస్త కిల్బిషో వోఢా ముదం వీతవిశంక ఊర్జితాం

సుహృత్తమం జ్ఞాతి మనన్యదైవతం దోర్భ్యాం బృహద్భ్యాం పరిరప్స్యతే థ మాం । ఆత్మాహి తీర్థీక్రియతే తదైవ మే బంధ శ్చ కర్మాత్మక ఉచ్ఛ్వసిత్యతః ॥

లబ్ధాంగసంగం ప్రణతం కృతాంజలిం మాం వక్ష్యతే౽క్రూర తతే త్యురుశ్రవాః । తదావయం జన్మభృతో మహీయసా సైవాదృతో యో ధిగముప్య జన్మతత్ ॥