312
ఆత్మవిచారము
[8 వ
పై చెప్పిన ప్రకారము "దయ” అను గుణమునుగురించి ధ్యానించుచురాగా దయాస్వభావముగల అణువులు మనస్సునందును ఇంద్రియములయందును దేహమునందును నిండి, దయఅణువులకును నిర్దయఅణువులకును సమాగమము అగుటవలన నిర్దయఅణువులు ఓడిపోయి దేహములను విడిచిపోవును.
ఇదే విధముగా ఏ సద్గుణమును సంపాదించవలెనని తోచినను సంపాదించవచ్చును. దుర్గుణములను పోగొట్టుకోవలెనని ప్రయత్నపడువారు ఆ దుర్గుణమునకు ప్రతికూలమైన సద్గుణ మేదో దానిని మననము చేసి చేసి అభ్యసించుచురావలెను. ఇదే అతి సులభమైన విధము.
మనోరాజ్యము
ఈ విషయమునందు ముఖ్యమైన సహాయము "మనోరాజ్యము" అనునొక అభ్యాసము కలదు. మనోరాజ్యము అను పదమునకు ఇంగ్లీషుభాషయందు Imagination అని పేరు. అనగా నిదివరకును మనకు లభించని సుఖమునో, దుఃఖమునో, ఐశ్వర్యమునో, జాడ్యమునో, భయమునో, సందర్భించినట్టుభావించి అట్టి అవస్థసందర్భించినయెడల ఏ విధముగా నడుచుకొందుమో ఆ విధమైన నడవడికను కనుపరుచుటకు సాధ్యమైన మనోభావము. హాస్యవిషయముగా ఈ మనోభావమును "గొంతెమ్మకోరికలు” అందురు. పారమార్థికవిషయముగానును, నివృత్తిమార్గయాత్రయందు ధ్యానాదిసమాధుల యనుష్ఠానమునందు మనోరాజ్యము ఉపాసకునికి అతిముఖ్యము అని జ్ఞానవాసిష్ఠమునందు చెప్పి