అధ్యా. 2]
ఉపక్రమము.
11
కం" అయినపుడు క్రీడించుటకు స్థలనిర్దేశము చేసికోకపోదురా. అట్టిస్థలము సప్తలోకస్వరూపమయిన బ్రహ్మాండము. తనయొక్క విస్ఫులింగము (అంశ) అను జీవాత్మయొక్క క్రీడార్థము బ్రహ్మాండమును సృష్టించెను. ఉపక్రమాధ్యాయమునందు, 1. క్రీడకుడైన జీవాత్మ, 2. క్రీడారంగమయిన బ్రహ్మాండము ఈ రెండును, గోచరములగుచున్నవి. ఈ రెంటినిగురించి రాబోవు అధ్యాయములలో సాధ్యమైనంతవరకు విపులముగా వ్రాయవచ్చునుగాని ప్రకృతమందు నటరాజరాజును, క్రీడక ప్రవీణుడునైన సచ్చిదానందమూర్తి యొక్క అనంతకోటి లీలాపరిణామములలో కొన్నిటినిగురించి సంగ్రహముగా వ్రాయ ఉద్దేశము.
సచ్చిదానందమూర్తి
అంతకుముందు ఏకముగానుండిన వస్తువునకు ఉపనిషత్తు నందు సత్ అని నామధేయము. తనయం దిమిడియుండు ఐశ్వర్యమును ఉపయోగపరుచుకొనిన తరువాత సద్వస్తువు సచ్చిదానందమూర్తిగా పరిణమించిరి. వీరికి సగుణబ్రహ్మయని పేరు. మాయా సమాగమము అయినది. గుణములు బయలువెడలినవి. శక్తులు, వ్యక్తికి వచ్చినవి. "నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయా సమావృతః" "మమ మాయా దురత్యయా” మొదలగు గీతావాక్యములు మాయయొక్క మహిమను తెలుపుచున్నవి. వివేక చూడామణీయందు
అవ్యక్తానామ్నీ పరమేశ శక్తిః
ఆనాద్య విద్యా త్రిగుణాత్మికా పరా ।