అధ్యా 8]
శీలము
309
తెలియనీయక దాచిపెట్టి, మాటలు మరియొకవిధముగా చెప్పి, కార్యములు మరియొక విధముగా చేయుదురు. అట్లు లేకుండుట ఆర్జవము.
ఆచార్యోపాసనం. బ్రహ్మజ్ఞాన మీయదగు గురువును సేవించుట. అక్షరాభ్యాసము, ఉపనయనము ఇట్టివి చేయించిన గురువులు ఆచార్యులవారు అనిపించుకోరు. "జ్ఞానోప దేష్టురాచార్యస్య శ్రద్ధాభక్తిభ్యాం శుశ్రూషాది క్రియయా ఆరాధనం ఉపాసనం ।” అక్షరాభ్యాసఉపనయనాదులను చేయించిన గురువులకన్న జ్ఞానోపదేశముచేయు గురువులు ఏ విధముగా అధికము అని అడుగవచ్చును.
దృష్టాంతో సైవ దృష్టః త్రిభువనజఠరే సద్గురో జ్ఞాన్‌నదాతుః ।
స్పర్శ శ్చేత్తత్రకల్ప్యః స నయతి యదహో స్వర్ణతా మశ్మసారం ।
న స్పర్శత్వం తథాపి శ్రితచరణయుగే సద్గురు: స్వీయశిష్యే ।
స్వీయం సామ్యం విధత్తే భవతి నిరుపమ స్తేన వా౽లౌకికే౽పి ॥
ముల్లోకంబులయందుగాని అంతకుపైననైనగాని జ్ఞానదాతయైన సద్గురువులవారితో తుల్యమైనది ఏదియును అగపడుటయే లేదు. అదేమండీ! అంతకష్టమా ? "పరుసమినుము సోకిన బంగారమైన పగిది" అని ఇనుమును స్పర్శమాత్రమున బంగారముగా మార్చుశక్తిగలది "అశ్మసారం" అను రాయి ఉండలేదా అని అందురేమో. ఇనుమును బంగారముగా మార్చినదే గాని ఆ యినుమునకు మరియొక ఇనుపతునకను బంగారముగా మార్చుశక్తిని ఇయ్య