అధ్యా 8]
శీలము
307
ఈ క్రింద కొన్ని ఆచరణీయములైన గుణములు వివరించి చెప్పబడును.
అమానిత్వము అనగా ఆత్మస్తుతియు పరనిందయు లేక యుండుట. మాన మనగా :- తన్ను తాను పొగడుకొనుట. "మానావమానీ దుఃఖీస్యా న్నైవసాధారణో జనః । అతో దుఃఖనిదానత్వాన్మానం యోగీ పరిత్యజేత్ ॥" తనను స్తోత్రము చేసికొనుచు నితరులను నిందించువాడు దుఃఖపడును. అట్టి స్తుతినిందలులేనివాడు అట్టి దుఃఖమును పొందడు. కనుక స్వస్తుతిపరనిందలవిషయమై యిష్టమునుంచుకొనకూడదు. స్వస్తోత్రము లేకయుండుట అమానిత్వము; లేక "అన్నాంగనాదిభోగేషు భావో మాన ఇతిస్మృతః । బ్రహ్మానంద సుఖప్రాప్తిహేతు ర్మౌన మితి స్మృతః" ॥ అనగా అన్నము, స్త్రీ మొదలగు భోగములందు తలంపులకు మానము అని పేరు. అట్టి తలంపులు లేకుండుట.
అదంభిత్వము. దంభము అనగా లేని పోని వేషభాషలు కలిగి యుండుట. "కృతం దంభా దదంభాద్వా కర్మతుల్యశ్రమం భవేత్ । శ్రమైకఫలమాద్యం స్యాద్ద్వితీయం సుఖసాధనం ॥ దంభముతోగాని దంభములేకగాని చేయబడు కార్యములకు శ్రమము సమానమే. దంభముతోచేయబడుకార్యమునకు శ్రమము ఒకటియే ఫలమగును. దంభము లేక చేయబడు కార్యమునందు శ్రమమున్నను సుఖము అనెడు ఫలము కలుగును. దంభములేకుండుట అదంభిత్వ మనబడును.