అధ్యా 8]
శీలము
303
తయు వారికుటుంబమే. 40 వ పుటయందు చెప్పినప్రకారముగా జీవాత్మలందరును పరమాత్మయొక్క అంశలే అయినపుడు జీవాత్మలలో భ్రాతృభావము చెప్పవలసిన అక్కరలేదు. అందరు జీవాత్మలకు జననస్థానము (పుట్టినస్థలము) ఒకటే. అందరికిని గమ్యస్థానమును ఒకటే. 40 వ పుటయందు సచ్చిదానందమూర్తి యొక్క శరీరమునందు జీవాత్మలందరును అణువులని చెప్పియున్నది. ఒకటే శరీరమందుండు అవయవములు ఒకటియొక్క క్షేమమును మరియొక్కటి కోరియే కదా ఉండవలెను.
జిహ్వాం క్వచిత్స్వాం దశతి స్వదద్భి స్తద్వేదనాయాం కతమాయ కుష్యేత్ ।
(శ్రీమద్భాగవతము, భిక్షుగీత.)
ఒకడు తన దంతములతో తనయొక్క నాలుకను కొర్కునె నసగా నెవ్వరిపైన కోపించుకొన్న యెడల ఆ నొప్పిమానును. అదే విధమున లోకమందెవ్వడు చేసిన కీడైనను తానుచేసినదే అని ప్రతిజీవాత్మయు స్నేహభావమును చూపి భ్రాతృభావమాచరించవలెననునది శీలముయొక్క పరమోద్దేశము.
యథా ప్రకాశయ త్యేకః కృత్స్నం లోక మిమం రవిః ।
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ॥
(భ. గీ. 13-33)
ఓయి అర్జునా, ఒక సూర్యుడు లోకమునంతయు నే విధముగా ప్రకాశింపచేయుచున్నాడో అదే విధముగా ఒకక్షేత్రజ్ఞుడు అన్ని క్షేత్రములయందునున్న వాడు.
ఏకో దేవ స్సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా ।