302
ఆత్మవిచారము
[8 వ
మావారే అందురు. ఈ విధముగా మావారు అనుమాటకు అర్థము అధికమగుచుండును. సాధారణముగా భూమిపైన నిలిచి తనచుట్టును చూచువానికి కొంతదూరమే దేశము అగుపడును. భారీ గోపురమును ఎక్కి చూచువారికి మరికొంచెము అధికముగా దేశము అగుపడును. పెద్దకొండ ఎక్కి చూచువారికి చాలా విశాలమైన దేశము అగుపడును. అదే విధమున మనుష్యులలో ఆత్మశక్తి అధికము కానుకాను మావారు అను మాటకు అర్థము చాల అధికము అగుచుండును.
శీలముయొక్క ఉద్దేశము ఏమనగా ఒక దేశమందలి జీవాత్మలకు ఒకరికార్యములవల్ల మిగతవార్లకును, ఇతరులకార్యముల వల్ల మనకును అననుకూలములు లేకయే జీవాత్మలందరును సముదాయముగా సుఖపడుటకు అనుకూలము కలుగజేయుటయే. ఒక సంసారమందుండు జీవాత్మలకు అందరికిని పరస్పర ఐకమత్యము ; అనేక సంసారములు చేరిన ఒక తెగవారికంతయు ఐకమత్యము ; అనేక తెగలుచేరిన ఒక దేశమందు అందరికిని ఐకమత్యము ఇట్లు అందరును ఒకటే సంసారమునకు చేరిన వారివలె బ్రతుకుచు మనకందరికిని పితామహుడైన మనువుయొక్క పెద్దసంసారమందు ఐకమత్యదృష్టి కలుగుటకు గానే శీలము ముఖ్యము. కనుకనే
అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసాం ।
ఉదారచరితా నాంతు వసుధైవ కుటుంబకం ॥
వీరు నావారు, వీరు నావారు కారు, అని అనుకొనుట అల్పబుద్ధిగలవారిచర్య; ఉదారబుద్ధిగలవారి ఆచారమేమనగా లోకమం