ఈ పుట అచ్చుదిద్దబడ్డది
8 వ అధ్యాయము
సుశీలాన్ సదాచారనిష్ఠాన్ పవిత్రాన్ ।
హరిం వా హరం నా సమం సేవమానాన్।
స్వశాస్త్రేషు దక్షాన్ పరబ్రహ్మనిష్ఠాన్ ।
ఉదాసీనసాధూన్ సమస్యె నమస్యే ॥
శీలము
మనుష్యులు లోకమందు నడుచు నడవడికలు తమకును ఇతరులకును సంబంధముకలిగించునవి. దేశకాలములనును ఇరుగు పొరుగువార్లసంతోషమును గమనించియే మనము ఏకార్యమైనను చేయవలయును. మన ఇరుగుపొరుగువారనగా మనము కాపురముండు ఇంటికి ఇరుప్రక్కల ఉండు ఇండ్లవారు. ఇది చాల సమీపదృష్టిగలవారి మాట. దూరదృష్టివంతులకు ఇరుగు పొరుగు అన్నమాటకు అర్థము వారి వారి దృష్టివిశాలమును పట్టియుండును. కొందరు మన గ్రామమువారందరును మావారే.
మేము ఏ కార్యము చేసినను మా గ్రామవాసులకు ఆ కార్యమువల్ల ఏ విధమైన కష్టమును రారాదు అందురు. అంతకంటె అధికమైన విశాలదృష్టి గలవారు మా జిల్లావారందరును