Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 7]

కర్మ

299

లను పోగొట్టుకొని దైవీసంపద్గుణములను వృద్ధిచేసికొనుటకు ప్రయత్నపడును. ఈ లోపల తనయొక్క ఆస్ట్రల్ బాడీ మెంటల్ బాడీ అను రెండుశరీరములును తన నిద్రాసమయమందు అస్ట్రల్ ప్ళేనులోనును మెంటల్ ప్ళేనులోనును స్వంతముగా చరించుశక్తిని సంపాదించుకొనియుండును. తన సంచితకర్మయందు తాను ఎవరెవరికి కీడుగాని దుఃఖముగాని కలుగజేసినాడో ఆ యా జీవాత్మలకు తానుచేసిన చెరుపుకు ప్రతిగా మేలుచేయుశక్తి కలుగును. తనకు కర్మసంబంధముగల జీవాత్మలు ఆస్ట్రల్ ప్ళేను లేక మెంటల్ ప్ళేనునందు నుందురు. నిద్రాసమయమునందు వారిని సంధించి వారికి మేలుచేసి ఆ ద్వారా సంచితకర్మ చాలమట్టుకు అరుగగొట్టవచ్చును.

కనుక కర్మ అనగా ఏదో ఒక రాక్షసి, అట్టి రాక్షసిని జయించుట కష్టము అని భయపడకూడదు. ఏ జన్మమందైనను మనము త్రికరణములతోను చేసిన కార్యములు కారణములుగా మారి ఆ కారణములకు న్యాయమైన ఫలితమును మనకు ఇచ్చును. అన్యాయమేమేమియు లేదు. కర్మదేవతలు బడి ఉపాధ్యాయుల వలె "శివశ్శివానాం అశివో౽శివానాం” అని యుందురు. అనగా మంచివారికి మంచి, చెడుపుచేసినవారికి చెరుపును ఇత్తురు. అన్ని విధములవల్లను జీవాత్మలు వృద్ధికివచ్చి పరమార్థమును పొందుటకు కావలసిన సహాయమును చేయుచుందురు. కనుక వారలు మనలకు పరమహితులే.

ఇపుడో ఇంతకుముందుజన్మములలోనో త్రికరణములతో చేసిన కార్యములయొక్క ఫలములనే మనము ఇపుడు అనుభవించు