298
ఆత్మవిచారము
[7 వ
జ్ఞానాగ్ని
శ్రీమద్భగవద్గీతయందు "జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మ సాత్కురుతే" అని చెప్పియున్నది. "ప్రారబ్ధకర్మణాం భోగా దేవ క్షయః" అని శాస్త్రములయందున్నది. ప్రారబ్ధకర్మను అనుభవించు సమయమందు అనేకులు వర్తమానకర్మకూడ పుట్టించుదురు. జ్ఞానము అనగా తెలివి. తెలివిని ఉపయోగించి నిరాకరించుటకు అసాధ్యమైనంత మాత్రము ప్రారబ్ధకర్మను అనుభవించి, అట్లు అనుభవించు నపుడు,
న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య నో ద్విజేత్ప్రాప్య చా౽ప్రియం ।
(శ్రీమద్భగవద్గీత 5-20)
ఇష్టమైనదానిని పొందినను సంతోషపడకూడదు. అనిష్టమైనదానిని పొందినను వ్యసనమును చెందకూడదు. సంతోషాధిక్యము వల్ల తనను తాను మరుచును. అట్లు మరిచినపుడు ప్రమాదము
సంభవించును. అదేవిధమున దుఃఖపడునపుడును తన్ను తాను మరుచును. అపుడును ప్రమాదము కలుగును. కనకనే తెలివి ముఖ్యము. ఇదియే జ్ఞానము.
సంచితకర్మను ఇక అనేకజన్మములెత్తి అనుభవించి క్షీణింపచేయవలసినది; లేక జ్ఞానమును ఉపయోగించి అరుగగొట్టవచ్చును. కర్మక్షయముచేసికోవలెనను ఇచ్ఛ జీవాత్మ కొంతమట్టుకు జ్ఞానమును సంపాదించిన పిమ్మటనే పుట్టును. ఆ మాత్రము జ్ఞానము వచ్చినపుడు జీవాత్మ తన శీలమును చక్క పెట్టుకొనుటకు ప్రయత్నించును. తనయందుండు అసురసంపద్గుణము