288
ఆత్మవిచారము
[7 వ
శిష్యుని మనస్సులో జనులు శాస్త్రప్రకారము వారి వారి కేర్పడిన ఆచారములను ఎందుకు అనుష్ఠించరు అని సందేహము కలుగునేమో అని శంకించి 33 వ శ్లోకములో
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే ర్జ్ఞానవా నపి ।
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ॥
ప్రతిమనుజుడును మంచిచెడ్డలు తెలిసినవాడైనను తన పూర్వజన్మ సంస్కారముచొప్పున (145 వ పుటయందు చెప్పిన స్వభావము ప్రకారము) నడుచునుగాని మనము చెప్పిన మార్గము ననుసరింపడు, ప్రతిమనుష్యుడును నా యుపదేశప్రకారము నడుచునని యూహింపరాదు అని సెలవిచ్చిరి. మరియు ప్రతిమనుజుడును తన స్వభావము ననుసరించియే నడుచు నంటే శాస్త్రము లెందుకుండవలెను. శాస్త్రములలో చెప్పిన పురుషకారము అను స్వతంత్ర శక్తికి అర్థమేమని ఆక్షేపము వచ్చునని
ఇంద్రియస్యేంద్రియస్యార్ధే రాగద్వేషా వ్యవస్థితా ।
తయోర్నవశమాగచ్ఛేత్తాహ్యస్య పరిపంథినౌ ॥
సమస్తేంద్రియములకును వానివానికిని సంబంధపడిన విషయముల యందు కొన్నిటియందు ప్రీతియు కొన్నిటియందు ద్వేషమును ఏర్పడియున్నవి. రాగము అనగా నొక మంచివస్తువును చూచినపుడు అది తనకుకావలెనని ఆశపడుట. ద్వేషము అనగా అట్టి వస్తువును తాను సంపాదించుటకు ప్రయత్నము చేసినపుడు అడ్డము వచ్చినవారియందు కలుగు విసుకు.
ఇంద్రియవ్యాపారములకు లోబడిన వారికందరికిని రాగద్వేషములుండుట తప్పదు; శాస్త్రార్థవిచారముచేసిన యోగ్యులు