Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 7]

కర్మ

285

శక్తికి "స్వతంత్రము.” “పురుషప్రయత్నము" లేక "పురుషకారము" అని పేళ్లు.

సంఘాతకర్మ

ప్రారబ్ధకర్మయే సంఘాతకర్మగా పరిణమించును. జర్మనీదేశమునందు పుట్టినవారనేకులు అల్పాయుస్సులుగా యుద్ధరంగమందు చచ్చిరి కదా. ఇంగ్లాండు మొదలగుదేశములు జర్మనీవారితో యుద్ధమునకుపోవురీత్యా అనేక లక్షలమంది అల్పాయుస్సులుగా చచ్చిరి. ఇది సంఘాతకర్మ. ఇదే విధమున ఓడలు మునిగి అనేకులు చచ్చుట, రైలుబండిపొర్లి అనేకులు మరణము చెందుట మొదలగునవియు సంఘాతకర్మలే.

ఇట్లు ప్రారబ్ధకర్మచోదితులై మనము ఈ జన్మమునందు కార్యములుచేయుచు ఆ కార్యములయొక్క ఫలములను అనుభవించవలెనని కోరుచుందుము. ముందుచెప్పినరీతిగా ఇప్పుడే ఫలమునిచ్చునట్టివి కాని వర్తమాన (క్రియమాణ లేక ఆగామి) కర్మ అంతయు సంచితకర్మతో చేరుతున్నది. ఇట్టు చేరి చేరి సంచితము అపరిమితముగా పెరిగిపోతున్నది. ఏదో యొక జన్మమందు భగవంతుని మాహాత్మ్యములను చదివియో వినియో పుణ్యవశంబున మోక్షేచ్ఛకలిగితే కర్మ అంతయు నశించితేనే గాని మోక్షమురాదు.

కర్మక్షయోపాయము

పురుషకారము అను స్వతంత్రశక్తిని ఉపయోగించి మేలుపొందవచ్చును. వర్తమానకర్మతో ఇతరులకు ఎవరికైనను