Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

ఆత్మవిచారము

[7 వ

బాడీ, యీరెంటియొక్క (దేహ) బీజములలోని అధికమైనశక్తుల కూడ ప్రారబ్ధకర్మ ఆచ్ఛాదించియుంచును.

ప్రారబ్ధకర్మవల్ల కొన్ని స్వభావములు ప్రముఖతచెంది కనుబడుచుండును. అతి కోపము లేక అమితమైన పిరికితనము, ఇట్టివి. ఈ గుణములకు వేదాంతశాస్త్రములయందు "వాసనలు" అని పేరు పెట్టియున్నారు.


దృఢభావనయా త్యక్త్వా పూర్వాపరవిచారణం ।
యదాదానం పదార్థస్య వాసనా సా ప్రకీర్తితా ॥


తాను చెయునదే సరియైన పని అను నిశ్చయముతో పూర్వాపర విచారములేకయే ఒక కార్యమును చేయుటకు వాసనాబలము అని పేరు. అనేకజన్మములందు ఒక విధమైనతలంపును ప్రయత్నపూర్వకముగా తలచియుండినయెడల ఆ తలంపును నిరూపించు కార్యమును పూర్వాపరవిచారములేకయే చేయు శక్తికలిగియుందుము. పూర్వమందు ప్రయత్నపూర్వకముగా మనమే తలచితిమి. ఇప్పటికి ఆ తలంపు వాసనారూపముగా దృఢమైనది. అది మంచి వాసనయైతే మరికొంతప్రయత్నముతో దృఢపరుచవలెను. మస పురోవృద్ధికి హానికరమైనవాసనయైతే పూర్వమందు మనము ఎంత ప్రయత్నముతో తలంపును తలచి తలచి ఆ తలంపునకు వాసనారూపమును ఇచ్చినామో అంత ప్రయత్నముతో అట్టి దుష్టవాసనకు విరోధియైన శుభమైనతలంపును తలచి తలచి ఆ దుష్టవాసనను అరుగగొట్టవచ్చును. ఇది మనకు సాధ్యము. గోడకట్టుటకు శక్తియుండినవానికి గోడను పడగొట్టుటకు శక్తిలేదా ? ఇట్టి