అధ్యా 7]
కర్మ
283
నది ఎన్ని జన్మములకుముందో అప్పట్లో ఎవరికి స్నేహితులుగా నుంటిమో ఏ యే దుర్మార్గములవల్ల ఎవరెవరిని శత్రువులుగాచేసి కొంటిమో వారందరును ఇపుడు మనకు స్నేహమును, ద్వేషమును చూపుటకుగా భూలోకమందు జన్మించియుందురు. వార్లతో సమాగమము కలుగును. శరీరము ఏ యే జాడ్యములకు లోబడవలెనో అవన్నియును ఈ కర్మను అనుసరించియే. ఈ స్థితులన్నియు జననకాలమునందు ఉండు గ్రహసంపత్తి సూచించును. మనకు ఇష్టమున్నను లేకున్నను ఈ పైన వివరించిన సందర్భములు సందర్భించేతీరును. ఇవన్నియు మన యిష్టానుసారము పూర్వమందు ఏదో ఒకజన్మమునందు నిర్ధారించినవి. ఇప్పటికి లభించినవి. ఐతే మనము నిర్ధారించుకొన్న ఆ పూర్వజన్మమునకును ఈ జన్మమునకును మధ్య కొన్నిజన్మములు అయిపోయినవి. ಅట్టి అవాంతరజన్మముల యందు తపోవిద్యాశీలములవల్ల మనము అప్పటికంటె కొంచెము ఉన్నతస్థితికి వచ్చియుండవచ్చును. అయినను ఏమి చేయవచ్చును. మనలయొక్క అభీష్టముప్రకారము కర్మదేవతలు మనయొక్క కోరికలను ఈడేర్చిరి. అవి ఇప్పటిస్థితిని పట్టి మనకు తగనివిగా నుండవచ్చును. విధి లేదు. మనము కోరుకొన్నదే గనుక అనుభవించే తీరవలెను. కాబట్టి కర్మఋణమును కడపటి రువ్వవరకును ఇచ్చి చెల్లించవలసినదే. ఇదండి ప్రారబ్ధము, 274 వ పుటయందుండు "కః కస్యహేతుదుఃన్‌ఖస్య" అను శ్లోకార్థము దీనిని విశదపరుచును. ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, స్థూలశరీరము, ఇవన్నియు నీ ప్రారబ్ధముయొక్క స్వభావమునుపట్టే యీ జన్మమునందు మనకు లభించును. ఆస్ట్రల్ బాడీ, మెంటల్