8
ఆత్మవిచారము
2 వ
ఒంటరిగా నొకటే సద్వస్తువుండెను. అటు ఒంటిరిగా నుండిన వస్తువును కొందరు సత్ అనియును మరిగొందరు అసత్ అనియును వ్యవహరింతురు. ఎవరు ఎట్లు వ్యవహరించినను అద్వితీయమై ఒక వస్తువు ఉండెననుకొందము. తనయొక్క ఒంటరితనమును తాను ఎరిగి అట్టి ఒంటరితనమును మాన్పుకొనవలెనని ఆ వస్తువునకు కాంక్ష కలిగినదనియు అపుడు ఆ వస్తువు "బహుస్యాం" అనుకొన్నది అనియు చెప్పియున్నది. పై చెప్పిన అద్వితీయమైన వస్తువునే పరబ్రహ్మము అందురు. పరబ్రహ్మ "1. సత్యం 2. జ్ఞానం 3. అనంతం” అని శ్రుతులు పలుకుచున్నవి. పరబ్రహ్మ ప్రణవస్వరూపము అనియు చెప్పబడియున్నది. ప్రణవమందును. అ - ఉ - మ అను భాగములు గలవనియును వినుచున్నాము. "బహుస్యాం" అను వాక్యమునకు అర్థము "నేను అనేకము కావలయును”. ఇందుల అర్థములు అనేకములున్నవి. అవన్నియు నిచ్చట వ్రాయ నుద్దేశము నాకు లేదు. అయితే "బహుస్యాం" అని తలచుకోగానే నిర్గుణబ్రహ్మము సగుణబ్రహ్మము అయినది. వారినుండి తేజస్సు మొదలగు మూడు వస్తువులు ఉద్భవించినట్లు ఛాందోగ్యోపనిషత్తునందు చెప్పియున్నది. అనగా ఇది సృష్టికి ఆరంభము అని అర్థము.
అగతి చ గతిమత్తాం ప్రాపత్
అను వచనముయొక్క అర్థమును విచారింతము.
వేదమందు "ప్రజ్ఞానం బ్రహ్మ" అను వాక్యమున్నది. బ్రహ్మవస్తువు ప్రజ్ఞానం. అనగా నొకపాత్రయందు నిండుకు నీళ్లుపోసి