అధ్యా 7]
కర్మ
279
సంబంధము మనకు ముందురాబోవు జన్మమునందు వార్ల సమాగమమును ఇచ్చును.
ఈ లోకమందు ఇతరులకు అనగా జనసముదాయమునకు సుఖము గాని దుఃఖము గాని కలుగచేస్తే ముందుజన్మమందు సుఖమయమైన ఇల్లు తోటలు మొదలగునవి లభించును. ఉద్దేశము అనునది యొకటి కలదు. కర్మఫలములు ఉద్దేశముల స్వభావముల ననుసరించి నిశ్చయింపబడును. పరులయొక్క శ్రేయస్సుకోరిన ఉద్దేశముతో కార్యమునారంభించి దైవవశమున కార్యముచెడి పోయినను ఉద్దేశము మంచిది గనుక కర్తకు చెడుపురాదు.
కర్మ త్రివిధంబుగా నుండును. సంచితము, ప్రారబ్ధము, క్రియమాణము అని. క్రియమాణము అను కర్మకు ఆగామియనియు పేరు కలదు. ప్రకృతమందు మనము చేయుకార్యములన్నియు క్రియమాణము అను పేర వ్యవహరింపబడును. ఈ జన్మమందు కారణరూపములుగా మనము చేసిన కర్మ అంతయు సద్యః ఫలము నిచ్చినవి పోను మిగిలినవి సంచితము అను కర్మతో చేరును. సద్యః ఫలములనిచ్చునవి అనగా అప్పుడే ఫలమును ఇచ్చునట్టివి. ఎఱ్ఱగా కాలిన ఇనుమును చేత ఎత్తితే ఇకముందు ఏదో యొక జన్మము వరకును దానియొక్క ఫలమునకు మనము కాచియుండనక్కర లేదు. ఆ నిమిషమునందే వ్రేళ్లుబొబ్బలెగిసిపోవును. ఇట్టివి కాని మిగిలిన కర్మలు సంచితముతో చేరియుండును. “అత్యుత్కటైః పుణ్యపాపైః ఇహైవ ఫలముచ్యతే” అనగా నతి బలవంతములైన పుణ్యపాపములకు ఇక్కడనే (యిపుడే) ఫలము కలుగును.