Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

ఆత్మవిచారము

[7 వ

మునిచ్చి వానిచేత మహాఘోరకృత్యమైన హత్య, ఘాత అను పాపకృత్యములను చేయించును. ద్వేషతలంపులను తలంచిన మనకు పైచెప్పినపాపములయందు భాగము కలదు. ఇందువలన మనను మనము చెరుచుకోవడమేకాక ఇతరులను కూడ చెరిచిన వారైతిమి.

మనతలంపులు రూపములెత్తి యితరులను దుష్కార్యములకో సత్కార్యములకో ప్రేరేపించియు మన కామక్రోధాదులును అదేప్రకారము చేయుటచేతను మన అశుద్ధమనోమయశరీరమును కామమయశరీరమును మనము తలచిన తలంపులకు అనుగుణముగా మారుచువచ్చును. మరియు పైన చెప్పిన ప్రకారము ఇతరులను కార్యములకు ప్రేరేపించిన పాపమునకుగా వారలుండుస్థలమున మనకు ఏదో ఒకజన్మము కలుగవలసియుండును. మనము పైన చెప్పినపాపమును తెలిసినవారముకాము. అందువల్లనే ప్రాయశ్చిత్తములయందు

“జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థాసు మనోవాక్కాయవ్యాసా రైః రహసి ప్రకాశే చ జ్ఞానతః ఆజ్ఞానతో వా మయా కృత మహాపాతకానాం ఆజ్ఞానతః సకృత్కృతానాం జ్ఞానతః కృతానాం పాపానా మపనోదనారం”

అని చెప్పుదురు. అజ్ఞానముతో, అనగా ఎరుకలేక, చేసినను చేసిన వారమే కదా.

త్రికరణములచేత చేయబడు కార్యములు ఇతరులకు సంబంధించియుండును. ఇతరులకు సుఖమునో ఉపద్రవమునో కలుగుచేయురీత్యా వార్లకు మనకును సంబంధము నేర్పరుచును. ఈ