Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 7]

కర్మ

277

పుణ్యమాచరించువానికే ఫలంబగునో తత్తుల్యఫలంబు చేయుమని ప్రేరేపించువానికిని, అనుమోదించువానికిం గూడ కలుగును.

మనము తలంచుతలంపులు ఇతరులను మంచితలంపులు తలుచునట్లు చేసినను చెడ్డతలంపులుతలచు నట్టు చేసినను ఆతలంపుల వల్ల కలుగు ప్రయోజనములు మంచివైనను చెడ్డవైనను వాటియందు మనకును పూచికలదు. 246 వ పుటయందు "సంభోగసంవిత్", "వర్గప్రశంసీ" అను పదములయొక్క అర్థము ఇపుడు మనకు విశదమగును. మనము ఒక్కరము తలంచిన దుష్టతలంపులు వేయ్యారుమందిని దుష్టతలంపులు తలచునట్లు చేయును. ఇందరిని చెడ్డదోవకు లాగిన పాపము మనది కదా. ఇదంతయు మనకర్మకు చేరును. రాబోవు జన్మములలో ఎపుడో ఏదేశమందో మనవల్ల చెడ్డస్వభావముపొందిన వారలనందరినిని సన్మార్గమునకు తిప్పవలసినది మనభారము. ఇపుడు చెప్పిన విధముగా మనము తలచిన ఒక తలపువల్లనే వెయ్యారుమందికి మనము ఋణస్థులమై తే ప్రతినిత్యము ఎన్నితలంపులు తలచి యెందరిని చెడిపియుందుము, చెడుపుచున్నాము. ఇది గమనింపవలయును.

రాగ ద్వేషములను పురికొలుపు తలంపులను ఒకానొకడు తలంచుచుండినయెడల అతని ప్రతితలంపును రూపమెత్తి అట్టివి అనేకములు ఏ ఊళ్లోనో ఎక్కడనో మరియొకడు ఎవనినైనను చంపను ఉద్దేశించి నిశ్చయము తక్కువై సంశయించుచు ఉన్న వానిని మన ద్వేషతలంపులవల్ల పుట్టినరూపములు ధైర్యపరిచి "అందువల్ల ఏమి? యోచించనక్కరలేదు. సంశయమెందుకు ? నీవు చేయదలచుకొనియుండు ఘోరకృత్యమును చేయము" అని ప్రేరేపించి ధైర్య