276
ఆత్మవిచారము
[7 వ
అని చెప్పబడియున్నది. అనగా నేదేశమందు నేకాలమందు ఎవ్వనిచేత చేయబడిన శుభాశుభకర్మలయొక్క ఫలములు ఆదేశములో నాకాలములో వాడే యనుభవించవలెనని తాత్పర్యము. జీవాత్మ యొక శరీరమందు చేసినకర్మలు పక్వము అగునంతవరకును ఆశరీరముండదు గనుక ఆశరీరము పోయినను వేరు శరీరమును సంపాదించికొని అనగా మరియొక జన్మమెత్తి తానుచేసిన కర్మలయొక్క ఫలములననుభవించును.
మనము మనస్సుతో, కామస్వభావముతో, చేతులుమొదలగు కరణములగుండా చేసిన కార్యములు, అనగా, తలంపులు కామములు క్రియలు, వీటియొక్క సముదాయములు కర్మ అని పేరు గొనియుండును. మనస్సుతో జేసినకార్యములు అనేకులను అందును. కర్మచేయుటయందు మనస్సు అతిబలశాలి; తలంపులు ఇతరులను అందును. 168 వ పుటయందు చెప్పినప్రకారము తలంపులు వాటికి అనుగుణములైన రూపములను దాల్చును. 169 వ పుటయందు చెప్పినప్రకారము తలంపులు కొనిన రూపములందు అందుకనుగుణమైన ఒక చేతనము ప్రవేశించి యితరులను కూడ తనవలె తలవమని ప్రేరేపించినందున ఇతరులుకూడ ఆ స్వభావము గలతలంపులను తలతురు. ఇతరులు తాను తలచినరీతిన తలచునట్టుచేసిన వానిని ఇతరులు తలచిన తలంపుల యొక్క పూచి అందును.
కర్తు శ్సాస్తు రనుజ్ఞాతు స్తుల్యం యత్ప్రేత్య తత్ఫలం ।
(శ్రీమద్భాగవతము. 4. స్కం - 21 అధ్యా)