అధ్యా. 6
సంసారచక్రము
269
డను ఆనందకరముగా నెఱ్ఱని చిగురుజొంపములు కనపడుచు, లతలు పుష్పించి అందువలన సువాసనను వెదజల్లుచు లోకులకు మనస్సంతోషము కలుగజేయుచున్నను పరులకు ఆనందము కలుగచేసిన సంతోషమొక్కటిదక్క తనవరకును ఏమియుకోరక యుండునో అట్లు లోకహితంబాచరించుచు శాంతమూర్తులును ప్రకృతి సంబంధమైన భాధలనన్నియు గెలిచినందున మహాత్ములైన తాము సంసార సాగరమును ఈదుకొని పారంగతులై, నిర్హేతుకముగా మనవంటివార్లను కూడ తమవలె సంతోషమును అనుభవించునట్టు చేయవలెనని శపథముచేసికొని, తాము సంపాదించుకొనిన మోక్షమునకు పోకయే మనలోకములయందే సంచరించుచు, తాము అందిన లోకంబులను వాని సంపాదించుసాధనంబును నెరుంగనివారు అక్కటా! దురంతదుఃఖములకు పాలుపడుదురన్న దయాసహిత పశ్చాత్తాపంబొక్కండు దక్క వేరు శోకంబులులేక యుందురు.
ప్రాయేణ దేవ మునయః స్వవిముక్తికామాః మౌనం చరంతి విజనేన పరార్థనిష్ఠాః । సైతాన్విహాయ కృపణాన్ విముముక్ష ఏకో నాస్య త్వ దన్యశరణం భ్రమతో౽నుపశ్యే ॥
ఓ దేవా, ప్రాయికంబుగా మునులు స్వము క్తి (తాము మోక్షము చెందవలెనని) ని కోరి మౌనము బూని జనసమ్మర్దములేని యరణ్యంబులందు దిరుగుచుందురు. అట్టివారు ఇతరులు అజ్ఞాన సాగరమునుండి తరించుమార్గమేదని యోచించరు. దీనులకు నుపదేశాదులనియ్యరు. నాకొక్కనికి నీవు ముక్తిని యిత్తువన్నను అట్టిదీనుల విడనాడి నీవిచ్చుముక్తిని నేను గ్రహింప నొల్లను అని భక్తశిరోమణియగు ప్రహ్లాదుడు చెప్పినట్టు తాము