Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

ఆత్మవిచారము

[6 వ

కి కోటీశ్వరుడు కాలేదు గనుక మరల సముద్రమందు మునుగుటకు ప్రయాణోన్ముఖడాయెను.

ఈ ప్రకారము 10 - 20 - 30 సంవత్సరములు చేసి కోటీశ్వరుడాయెను. ఈ యితిహాసమును జీవాత్మయొక్క సంసార చక్రయాత్రకు పోల్చవలయును. అదియెట్లంటే ముత్యములకుగా సముద్రములో మునుగువాడు జీవాత్మ. జీవాత్మయొక్క ఊరు హైయర్ మెంటల్ ప్ళేను. ఆ యూరియందలి కోటీశ్వరులు ఎవరంటే అనేక జన్మములకుముందు మనము ఇపుడు ఉన్న విధమునననే సాధారణ జనులుగానుండి అనేకజన్మములయందు ప్రయత్నముచేసి సంసిద్ధి చెందినవారు. వీరికి జీవన్ముక్తులనిపేరు. జీవన్ముక్తులనుగురించి యిక ముందు వ్రాయబడును. హైయర్ మెంటల్ ప్ళేను అను మహర్లోకమందు భృగుమహర్షి మొదలగు జీవన్ముక్తులు నివసించుచుందురు. సంసారచక్రమునందు సంచరించుచుండు జీవాత్మలందరును ముత్యములవ్యాపారము చేయువారితో పోల్చబడుదురు. జీవన్ముక్తులు కోటీశ్వరులతో పోల్చబడుదురు. జీవన్ముక్తులు ఎల్లపుడును సంతోషభరితులై యుందురు.


శాంతామహాంతో నివసంతి సంతో వసంతవ ల్లోకహితం చరంతః ।
తీర్ణాస్స్వయం భీమభవార్ణవం జనానహేతునా న్యానపి తారయంతః ॥


వసంతఋతువు అనగా చైత్రవైశాఖమాసములయందు సూర్యప్రకాశము బాగుగా నాహ్లాదకరముగానును ఆ వేడిమిని తగ్గించుటకుగా తొలకరివానలు కురిసి అంతకుముందు ఆకురాలుకారునందు చెట్లు, వృక్షములు మొదలగువానిలో పండుటాకులన్నియు రాలిపోయి, అశోకవృక్షములు మొదలగువానియందు చూడచూ