266
ఆత్మవిచారము
[6 వ
ఫిజికల్ ప్ళేనును చేరి అచ్చట 50-60-70 సంవత్సరములు జీవించియుండి అనుభవసామగ్రిని సంపాదించుకొని ఆ సామగ్రిపైకి ఒకతరహా సామగ్రియయిన కామములను కామలోకమందు విమర్శించుకొని ఆలోకపు ఉపాధియైన కామమయశరీరమును చెదరకొట్టుకొని ఆ దేహమందుసంపాదించిన వాసనలు (శక్తులు) అన్నిటినిని ఆ దేహబీజమందు ఇముడ్చుకొని లోయర్ మెంటల్ ప్ళేనును ఎక్కి అక్కడ అనుభవసామగ్రినంతయు పరిశీలించి అందుగుండా సంపాదించిన వాసనలు (శక్తులు) అన్నిటితో సహ తనయిల్లు చేరి శుద్ధమానసశరీరవాసియై తన యాత్రవల్ల తనకు కలిగిన లాభనష్టములను లెక్కచూచుకొనును. ఇపుడు ముగిసిన సంసార చక్రవర్తులమువలె మరియొక తూరి ప్రయాణోన్ముఖుడవును. కనుకనే 198 వ పుటయందు "పునరపి జననం" అని యుపయోగింప బడినది.
జీవాత్మ యొక వ్యాపారితో పోలినవాడు. సముద్రమందు మునిగి ముత్యములను తెచ్చి వ్యాపారముచేయువాడు అని చెప్పుదము. ఒక చిన్న ఇతిహాసమును వ్రాతము. ఒక దేశమందు ఒక యూరియందు సముద్రమందుమునిగి ముత్యములనుఎత్తివ్యాపారము చేయువారలు అనేకసంసారులుండిరి. అందులో కొందరు పదే పదే సముద్రమందు మునిగి ముత్యములనెత్తి తెచ్చి వ్యాపారముచేసి కోటీశ్వరులయిన వారు. మరికొందరు అనేక తరగతుల భాగ్యవంతులు. పేదలుకొందరు. పేదవార్లపైకి ఒకానొకడు తమ కులమువార్లలో కోటీశ్వరులను చూచి ఐశ్వర్యవంతులు అయినందున సముద్రములో మునగక సుఖముగానున్నారు, నేనెందుకు