Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

ఆత్మవిచారము

[6 వ

తమయెదుటనుంచుకొని యితర చింతనములేకయే పూజయందు మగ్నులై యానందించుచుందురు. ఇట్టి యానందము పొందుటవల్ల భక్తియను గుణము వృద్ధిపొంది మరల భూలోకమునకు జన్మమునకు వచ్చునపుడు మరియునధికమైనతరగతి భక్తిని చేయుటకర్హులుగా జన్మింతురు.

తన మగడే దైవము అని పూజచేయుచుండిన ఒక హిందూ స్త్రీ యీప్రదేశమునకు పోవును. తనయింటియందు ఒక కృష్ణ విగ్రహమును పెట్టుకొని పూజచేయుచుండిన మరియొకస్త్రీ ఈ సబుప్ళేనుకు వెళ్లును. అక్కడ భూలోకమందు తాను పూజలు సలిపిన కృష్ణవిగ్రహమునే మరి అధికమైన భక్తితో పూజించుచుండును. ముఖ్యముగా భూలోకమందు మూఢభక్తి జరిపినవారందరును ఈ సబుప్ళేనుకు ఎక్కుదురు. ఒకటి ముఖ్యముగా విమర్శించవలసినది. మెంటల్ ప్ళేనుయొక్క ఆరవసబుప్ళేనునకు తీసుకొనివెళ్లునట్టి భక్తి ఏదో ఒక విగ్రహమునకు దారపోయబడినదియు, ఆ భక్తి, ఏవిధమైన లోకసేవారూపముగా పరిణమించకపోయినదియునై యుండును.

మరియు భూలోకమందు పూజలుచేయుచుండిన మృత్పాషాణలోహాదులతోచేసిన విగ్రహములే దేవుండ్లని భావించియుండిన వారుకూడ ఇక్కడ ఉందురు.


తక్షాది నీచైస్సుకృతానసత్యాన్ పాషాణమృద్దారుమయాంశ్చ దేవాన్ ।
భజన్తి యే మాధవనిందకాస్తే పూర్ణస్సదానందమయో హి విష్ణుః ॥


రాళ్లుచెక్కువాడు, కుమ్మరవాడు, వడ్లవాడు మొదలగు అజ్ఞులు చేసిన బొమ్మలయందు ప్రాణప్రతిష్ఠ చేయకయే ఆ విగ్రహములే