అధ్యా. 6
సంసారచక్రము
261
నందు పూజలనుకొను నటరాజస్వామియందు భక్తి. ఐతే కర్మవశమున మధ్యార్జునమునందు కాపురముండవలసినదిగా నేర్పడినది. ఈ వైదికశిరోమణి భగవన్నామస్మరణచేయుచు వృధా గ్రామ వార్తలు వదిలియుందురు. భక్తులే. వారి నామస్మరణ ఏమంటే “నటరాజప్రభో3మహాలింగ, నటరాజప్రభో3మహాలింగ" అని ఎలుగెత్తి స్మరణచేయుచుండిరి. నటరాజప్రభుపు ఏమి? మహాలింగుడు ఏమి ? అని విచారించినపుడు రహస్యము బయలుపడినది. భక్తుని ఇష్టదైవము నటరాజేశ్వరులు. వారు చిదంబరమునందుందురు. అయితే తానుండు ఊళ్లోని దైవమునకు పేరు మహాలింగులు. ఉన్న యూరిదైవమునకు మర్యాదచేయకున్న వారికి కోపమురావచ్చును, ఇది మహా అపరాధము, గనుక తన యిష్టదైవము కొంతదూరమందున్న చిదంబరక్షేత్రవాసియైన నటరాజప్రభువు వినవలెనని ప్లుతసహితసంబుద్ధియు ఊళ్లోనిదైవమునకు సామాన్య సంబుద్ధియుగాను నామస్మరణము చేయుచుండిరి. ఇట్టి భక్తిచేయువారు మెంటల్ ప్ళేను ఆరవసబుప్ళేనుకు వెళ్లుదురు.
మరియు ప్రతీక ఉపాసనచేసిన వారు కూడ ఇచ్చటికే వెళ్లుదురు.
మా ఊరియందుండు ద్రౌపదమ్మవంటి సత్యమైన దైవ మెక్కడయులేదు. శ్రీశైలమందుండు ఈశ్వరుడు సాక్షాత్తుగా కైలాసాధిపతియే అనువారును, పండ్రాపురమందుండు. విఠలరాయలస్వామితో సమానమెవరు అనుచు ఆ విగ్రహములకు పూజసలిపితమను తాము ఆ స్వాములకు నివేదించుకొనుచుండిన వారలందరును ఈ సబుప్ళేనునందు తాము పూజచేసిన విగ్రహములను