Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

ఆత్మవిచారము

[6 వ

కొంటే మేలుచేయువాడు; వేడుకోకుంటే కీడుచేయువాడు అను నీ విధములైన యభిప్రాయములు గల వారలు ఈ ప్రదేశమందుందురు.

తిరుపతివేంకటేశ్వరులకు వడ్డికాసులవాడు అని యొక పేరు వాడుకలోనున్నది. వేడుకొన్నప్రకారము చెల్లించకుంటే వడ్డి కట్టుచుంటే కోపగించుకోడు అని నమ్మకము.

పెరటాశినెలలో శనివారమునాడు దీపారాధన చేయకుంటే రోగములను నొప్పులను ఇచ్చువాడు, మ్రొక్కుపడి చెల్లించినచో జాగ్రతగా కాపాడువాడు అనియు నమ్మకములును కలవు. ఇదే విధమున శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి కూడ అపవాదము కలదు. కృత్తికానక్షత్రమునాడు ఉపవాసముండుకుంటే రోగములను కలుగజేయును. మ్రొక్కుకొనిన ప్రకారము కృత్తికలు నడువకుంటే శ్రమకలుగజేయువాడు అని మొదలగు విధములలో అప్రతిష్ఠ కలదు.

ఇవంతయు కొందరియనుభవములో నిజమే. ఇట్టి అనుభవములు అనుభవించువారలు కూడ భక్తులే. కాదనకూడదు. మరియు మహావైదికశిరోమణులైన బ్రాహ్మణశ్రేష్ఠులని పేరుపెట్టుకొన్న వారు కూడ ఇట్టి భక్తిసలుపునారు కొందరున్నారు. ఒక ఉదాహరణము. మధ్యార్జునము అని తంజావూరుజిల్లాయందు ఒక మహాప్రఖ్యాతికెక్కిన శివస్థలముకలదు. ఆ యూరియందు భస్మజాబాలోపనిషత్తునందు చెప్పిన విధముగా పుష్కలముగా విభూతి పుండ్రములు ధరించినవారు ఒక పండితులుండిరి. మధ్యార్జునములో కోవెలలోనున్న శివవిగ్రహమునకు మహాలింగస్వామియని పేరు. ఇపుడు చెప్పిన బ్రాహ్మణోత్తమునికి చిదంబరక్షేత్రము