ఈ పుట అచ్చుదిద్దబడ్డది
2 వ అధ్యాయము
అజమసి జనియోగం ప్రాప దైశ్వర్యయోగాత్ ।
అగతి చ గతిమత్తాం ప్రాప దేశం హ్యనేకం ।
వివిధవిషయ ధర్మగ్రాహి ముగ్ధేక్షణానాం ।
ప్రణతభయనిహంతృ బ్రహ్మ యత్తన్నతోస్మి ॥
ఉపక్రమము
ఉపక్రమము అను పదమునకు ఆరంభము అని అర్థము. ఉపసంహారమనగా తుదయని యర్థము. ఉపక్రమోపసంహార బద్ధమైనది వ్యక్తప్రపంచము. అనగా లోకము. ఉపక్రమోపసంహారములచే బంధింపబడని వస్తువు చైతన్యమొక్కటే. చైతన్యమునే బ్రహ్మ, పరబ్రహ్మ అనుపేళ్ల వ్యవహరింతురు. ఈ యధ్యాయముమొదట అచ్చుపడియుండు శ్లోకమునకు అర్థము బ్రహ్మవరము. "అజం” - జన్మములేని వస్తువు అని నపుంసక లింగమందు ప్రయోగింపబడియున్నది. భాషయందు పుల్లింగము స్త్రీలింగము, నపుంసకలింగము అని మూడులింగములు గలవు. పరబ్రహ్మమును మననముచేయునపుడు స్త్రీపురుషభేదములు అది