Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

ఆత్మవిచారము

[6 వ

స్నేహించి, కౌగిలించి, ఆ విధమున ఆనందించి, మరల మరల అనేకకాలము ఇట్లు ఆనందించి స్వప్రయోజనము అను స్వభావమును పరిపూర్ణముగా మరుతురు. లోకమందు చాలమందికి అనుకంపనుచూపిన మహానుభావునిచేతిగుండా వేలకొలది జనులు మేలుపొందియుందురు. మేలుపొందినవారలలో కొందరు చనిపోయి స్వర్గలోకమందు చేరితే తమకు మేలు చేసినవానిని ఎల్లపుడును తలచుకొందురు. తలచుకోగానే మేలుచేసినవాని మనోమయమైన రూపము ఒక్కటి యేర్పడును. ఆ రూపమును మేలుపొందినవాడు ప్రేమించి పూజించి తన కృతజ్ఞతను చూపును. మేలుచేసినవాని జీవాత్మ మేలుపొందినవాడు కట్టిన మనోమయరూపమందు ప్రవేశించును. జీవాత్మ అనేక నూర్ల శరీరములలో ప్రవేశించి వానికంతయు తేజస్సును ఇయ్యగలశక్తి కలిగియుండును. ఆ సమయమందు మేలుచేసిన మహానుభావుడు భూలోకమందేయుండును. తనచేత మేలుపొందినవారలు తననుగురించి ప్రేమించుచున్నారని తెలియకయే యుండును. ఐతే ఈ ప్రకారము స్వర్గవాసులు తనను ప్రేమించుట మేలుచేసినవానికి మిగుల వృద్ధికరము.

ఒక పరమరహస్య మున్నది. ఆత్మబుద్ధిమనస్కుడు అని వాడబడిన ప్రాజ్ఞాత్మయొక్క శక్తి అపారము. సంసారచక్రభ్రమణమునందు తనలో కొంతభాగమునే వినియోగపరిచి తాను మహర్లోకానుభవమును తరుచుగా పొందుచుండును. మరియొక పరమరహస్య మేమన ఎవరైనను ఏ లోకమునందైనను తనను తలచిన యెడల ఆ తలంపు ప్రాజ్ఞాత్మకు వెంటనే తెలియును. ఆతలంపు తలచినవారు తనరూపమువంటి రూపమును మనసాకట్టితే వెంటనే