Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

ఆత్మవిచారము

[6 వ

లు చూడుడు). శరీరమందుండి అనేకసంవత్సరములకాలము జీవాత్మ సుఖములననుభవించుననియు చెప్పబడియె. కనుక కామమయశరీరముతో కామలోకమందుండి పడిన మనోవ్యధలన్నిటివల్లను జీవాత్మకు విరక్తికలుగుటకు కారణమవును. ధర్మమునకు విరుద్ధములుకాని కామములనే తలంచునట్టి శక్తి యేర్పడును. ఇది కామలోకముయొక్క ఉపయోగము. మరియు భూలోకమందు అల్పాయుష్మంతులుగా చచ్చెడివారు ఒక సంవత్సరము లేక రెండు సంవత్సరముల కాలము చాల అనారోగ్యవంతులై రుగ్మతవల్ల బాధపడ లేక నాకు చావైననురాదా, ఈ శ్రమ ఆ విధముగానైనను నివర్తికాదా అని పదే పదే ప్రతిదినము కోరుకొనుచుండి భూలోకమునందు ఆ శరీరమునందుండుటకు సాధ్యములేక చచ్చువారును, అతి దీర్ఘకాలము బ్రతికియుండి


జీర్యంతే జీర్యతఃకేశాః దంతా జీగ్యంతి జీర్యతః !
.................తృష్ణైకా నిరుపద్రవా ॥


ముసలితనము రాను రాను వెంట్రుకలు రాలిపోవును ; పండ్లు రాలిపోవును; అంగములు బలహీనములై పోవును; అయినను ఆశ (కామము) మాత్రము నిరుపద్రవముగానుండును అని మనస్సులో ఇంద్రియచపలముకలిగినను ఆ చపలమును తీర్చుకొనుటకు ఇంద్రియుములయందు వీర్యములేనందున "ఏల ఈ వృథా ఆశపడెదవు" అని మనస్సుకు పలుమారు బుద్ధిచెప్పుచువచ్చువారు, తద్వారా కించిత్తువైరాగ్యమును అభ్యసించువారును, లేక సంసారమందు ముసలివారుగానుండి తనను తన పిల్లలు పాపలు యుక్తులు అడుగ