Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

ఆత్మవిచారము

[6 వ

రీతిగా బయలువెడలుచుండును. ఆరోగ్యముతక్కువైనపుడు వేగము తక్కువైన బలరశ్ములు బయలు వెడలుచుండును.

ఇంగ్లీషుభాషయందు (Vampire) వాంపైర్ అని యొకశబ్దమున్నది. అర్థము ఏమంటే. తన స్థూలశరీరమును ఏవిధముగానైనను క్రూరకార్యములు చేసి కాపాడుకొని సరియైన దేహబలముతో దీర్ఘకాలము బ్రతికియుండవలయునని యాశగొనియుండువారు. వాంపైర్లలో అనేకతరగతులున్నవి. ఒకతరగతివారు మనలో ననేకులున్నారు.

కొందరు ముసలివారలు ప్రయత్నపూర్వకముగా తనకంటె బలశాలులుగానుండు యౌవనపురుషులయొక్క దేహములనుండి వారి యెరుకలేకయే బలమును పీల్చుచు తమదేహములను ద్రోహమువల్ల కాపాడుకొనుచుందురు. యౌవనపురుషులు కొంతకాలమునకు ఏమోకారణము తెలిసికొనలేకనే బలహీనులై అనారోగ్యత చెందుదురు. ఇట్టి వారలను గురించియే


స్వప్రాణాన్ యః పరప్రాణైః ప్రపుష్ణాత్యఘృణః ఖలః ।
తద్వధస్తస్య హిశ్రేయో యద్దోషాద్యాత్యధః పుమాన్ ॥

(శ్రీమద్భాగవతము)


ఇట్టి పరప్రాణహారులు కామలోకమునందు పడు శ్రమనుగురించి వ్రాయవలసిన యవశ్యములేదు.

ఆస్ట్రల్ ప్ళేనునుగురించి యింకననేకవిషయములను వ్రాయవలసియున్నను ఈగ్రంథమునందు ఈస్థలమునందు ఇంతకన్న నధికముగా వ్రాయుటకు సాధ్యము కాదు. ఆస్ట్రల్ ప్ళేను నందుండు వారలయొక్క ఆశలను తృప్తిచెందించుటకై శ్రాద్ధాదులు చేయు