Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా. 6

సంసారచక్రము

251

కొని యుండవలెననునది. ఎన్నికార్యములు, నోములు, జపములు చేయుచుండినను ఈ ఒక అభిప్రాయమును మాత్రము ఏమరక యుందురు.

ముసలివార్లకు దేహపటుత్వము రావలెనంటే బాల్యదశ యందుండువారి శరీరములోని అణువులు ముసలిశరీరములలోపలికి చేరితేనేగాని సాధ్యముకాదు. కనుక తెలిసియైనను తెలియకనైనను అన్నమయకోశమునకు అభిమానియైన భూతాత్మ (212 వ పుట చూడుడు) తన (అన్నమయకోశము) దేహమునందుండు ముదుసలి యణువులను తరుమగొట్టి తనచుట్టునుండు యౌవనపురుషులయొక్క శరీరములయందుండు అణువులను దొంగిలించి తన అన్నమయకోశమందుచేర్చును. ఇట్లు కొంత కొంతగా ముసలివానిశరీరము కూడ యౌవనపురుషులశరీరములవలె ఆశిష్ఠములును ద్రఢిష్టములును గానగును.

సాధారణముగా మనదేశమందు లేతబిడ్డలను ముసలివాండ్ల సమీపమందువిడిచి ఆటలుచూపుమని చెప్పుట వాడుక. ఇది చాల తప్పు. అణువులకు తామున్నస్థలమువిడిచి తమయిష్టమువచ్చిన స్థలములకుపోవుట వాడుక యని యిదివరకే చెప్పబడినది. ముసలివార్ల శరీరములయందుండి అణువులు బిడ్డలశరీరములకును, బిడ్డలశరీరముల యందుండి అణువులు ముసలివార్ల శరీరములకు పోవుట సాధ్యము. దీనియొక్క ఫలమేమంటే ముసలివార్లకు బలమువచ్చును. బిడ్డలకు బలముతగ్గును. కనుక ముసలివార్లవద్ద బిడ్డలను ఇయ్యకూడదు.

ఆరోగ్యవంతమైన దేహమునుండి దేహముయొక్క బలము ప్రతిరోమకూపమునుండియు ఆకాశబాణములు బయలువెడలు