250
ఆత్మవిచారము
[6 వ
యిక్కడనేయున్నవి. కనుక కామలోకవాసము అంత గర్హితముకాదు. కామలోకపు అధోభాగము మాత్రమే అసూయ కలుగచేయునది. మనుష్యులస్వభావమునందు ప్రకృతికి సంబంధించిన 200 పుటయందు చెప్పిన కామక్రోధాదిపండ్రెండు దుర్గుణములను, 246 వ పుటయందు చెప్పిన ఏడువిధములైన క్రౌర్యములును, మరియు ననేక దోషములనును కామలోకమందు ప్రతిజన్మమునందును కొంచెము కొంచెముగా పోగొట్టుకొందుము. "జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయాత్పాపస్య కర్మణః" పాపకర్మక్షయానంతరము పురుషునకు జ్ఞానము జనించును అని యర్థము. కనుక కామలోకమందు కలుగు పాపక్షయమును, పాపభీతియు జీవాత్మయొక్క లాభముకొరకే యని సంతోషపడవలెను.
తమకు అపరవయస్సు, ముదుసలితనము, ముదిరిపోవుచుండగా, భరతఖండమునకు స్వరాజ్యమువచ్చినపుడు చూచి సంతసించితేనేగాని నేను చావను అని అపారమైన మనోదృఢముగ దీర్ఘకాలము జీవించవలెనని కోరుచుండువారు ; శ్రీ జగద్గురువులుగారు భూలోకమందవతరించునప్పటికి నేను ఈ శరీరమందే యుండి చూచి ఆనందించవలెనని యుండువారుకొందరు; నామనుమనికి మనుమడు పుట్టిచూడవలెననియు అంతవరకును తన దేహము దృఢముగానుండవలెననియు అతిబలవంతమైన మనోదృఢముగనుండువారు కొందరు; ఇట్లు అనేకులు, సాధారణముగా అవ్వలు, తాతలు, అతిబలవంతమైన కోరికతోనుండువారున్నారు. సర్వకాలములయందును ఒకటే యుద్దేశము. అదేమనగా నెట్లైనను తనదేహమును మంచి దృఢమైనస్థితియందుంచు