అధ్యా. 1
దివ్యజ్ఙానసమాజము.
5
నేర్పడిన సమాజమునకు థియోసాఫికలుసొసైటి యనియును దివ్యజ్ఞానసమాజము అనియును పేళ్లు.
దివ్యజ్ఞానసమాజమునందు నేర్పరులు కొందరు అనేక గ్రంథములను ఇంగ్లీషుభాషయందు వ్రాసియున్నారు. నాయొక్క అదృష్టవశమున దివ్యజ్ఞానసమాజమును చేరి ఆ గ్రంథములను చదివినాను, చదువుచున్నాను. హిందూమతగ్రంథములందు అనేక స్థలములందు వెద చల్లబడిన బహుముఖ్యమగు విషయములెల్ల చదువువారికి సులభముగా నర్థమగునట్లు దివ్యజ్ఞానసమాజగ్రంథములయందు ఒకచోట చెప్పబడియున్నవి. అట్టివిషయములను చదివి వానికి సామ్యములైన విషయములు భారతభాగవతాది పురాణములందును ఉపనిషదాదిగ్రంథములందును ఎక్కడనున్నవని వెదకి కనిపెట్టిన వానిలో నాశక్తికొలదిని అవగాహనచేసికొనిన కొన్ని విషయములను ఆత్మవిచారము అను పేర నొక చిన్నగ్రంథముగ వ్రాయనుద్దేశించి ప్రారంభించినాను. ఇందువలన నేను థియోసాఫికలుసొసైటికీ నా కృతజ్ఞతను చూపుకొనుచున్నాను గాని నా పాండిత్యప్రకటనకుగా వ్రాయలేదు. ఈ థియోసాఫికలు సొసైటి లోకమందంతయు విస్తరిల్లి యున్నది. ముఖ్యముగా మన భరతఖండమునందు విశేషముగా ప్రబలియున్నది. ఇందు మతవైషమ్యములు లేక ప్రజలు ఐకమత్యము కలిగి జీవించుచుండుటకు అనేక సౌకర్యములున్నవి. దివ్యజ్ఞానసమాజపు ఉపయోగములనును ఔన్నత్యములనును గురించి వ్రాసినగ్రంథము లనేకములు గలవు. గనుక ఇక్కడనింతకంటె నధికముగా వ్రాయలేదు.