Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా. 6

సంసారచక్రము

245

నగలపైన అతిప్రేమతోనుండిన స్త్రీ చచ్చిన పిదప ఆ నగలుఉన్న స్థలముచుట్టు కావలియుండి ఆ నగలను ఎవరైనను ఉపయోగించకూడదని అట్లు ఉపయోగించువారిని బెదిరించి ఆ విధమున నగలకు తనకుగల బంధమును భద్రపరుచుచుందురు. మరికొందరు తమ అభీష్టములను తమబంధువులకు స్వప్నమందు కనబడి తెలియచేయుదురు. స్వప్నములను జ్ఞాపకముంచుకొన్న బంధువులు కొన్నిసందర్భములయందు ఆ అభీష్టములను నెరవేర్చునట్టు చేయుదురు.

హిందువులలో ప్రేతలకు నిత్యవిధిచేయునపుడు నిత్యపిండమును "గృధ్రవాయసజలచరముఖేనో ప్రభుంక్ష్వ" అని యిత్తురు. ఆ పిండమును కొన్నిసందర్భములందు కాకులు తాకవు. అపుడు ఏమి జరుగుతున్నదంటే తనమనస్సులోని అభీష్టమును తనవారికి తెలుపగోరి ప్రేత ఆ పిండమును తాకుటకు వచ్చిన కాకులను బెదిరించును. మనుష్యులకు లేని సూక్ష్మదృష్టి కాకులకు కలదు. కనుక ప్రేతను కాకులు చూచి ఆపిండముయొక్క సమీపమునకు పోక దూరాన చెట్లుచేమలపై కూరుచుండును. అపుడు ప్రేతయొక్క బంధువులుకొందరు ప్రేతనుచూడకపోయినను తమయెదుట ఉన్నట్టు భావించి "నీమనస్సులో ఏమి కోరిక ? ఇట్టిదా ? ఇట్టిదా?" అని తమకు తోచిన విషయములనెల్ల మాటలతో అందురు. ఆ కోరికను ఈడేర్చెదము అని వాక్కుదత్తము చేయుదురు. అపుడు కాకులు పిండమును తినును. ఇట్టివారు కామలోకపు ఆరవ సబుప్ళేనువారు చచ్చినవారికి స్థూలశరీరము ఒక్కటి లేదేగాని వారికి మనుష్యులయందు ప్రేమ ఏమియు తక్కువకాదు. కనుక తాము