244
ఆత్మవిచారము
[6 వ
అహంకారమమకారంబులచే ప్రేరేపింపబడి భూతములకు ద్రోహమొనర్చి, దినదినము తనను కాపాడుకొనువారును ; పశువులను పక్షులను స్వప్రయోజనార్థము వేటాడి చంపిన నిర్దయులును ; న్యాయాధి పత్యమందుండి లంచముల తిని దండానర్హుల దండించియు, దండనీయులను విడిచిపెట్టిన మదాంధులును; చిన్నదొంగతనములను చేసినవారును; ఇతరులసొమ్ము మ్రుచ్చిలించినవారును; ధాంభికులై దంభయజ్ఞములం జేసి పశువులను పీడించినవారును; ఇతరుల యిండ్లకు నిప్పుపెట్టికాల్చినరీత్యా ఇతరులకు కష్టముకలుగజేసినవారును; ఇట్టివారు ఇచ్చట తమతప్పులకు ప్రాయశ్చిత్తరూపక మనోవ్యధల ననుభ వించుచుందురు.
మరిగొందరు తాము భూలోకమందుండినపుడు మనసా చింతించియున్న కామములను అనుభవించకముందే చనిపోయిరి. అట్టివారు ఆయా కామములను అనుభవించుటకు ఇచ్ఛయించి తమ మనస్సులోని అభీష్టములను భూలోకమందుండు తమబంధువులకు తెలుపవలెనని కొన్ని విధములయిన ప్రయత్నములను చేయుదురు. అనగా పూర్వము తమయిండ్లుగానుండిన స్థలములకు వచ్చి తమబంధువులు తమను కనుక్కొనుటకుగా నధికప్రయత్నముచేయుదురు. నిష్కారణముగా ఏదో తలుపులు తటతట శబ్దమవును. లేక వేరువిధములగా తమబంధువులను పిలుతురు. నీళ్లుచల్లినట్టు నీటితుంపరలను వెదచల్లుదురు. అపుడు ఇంటివారు ఇదేమి అని తమచుట్టు పరీక్షించి ఆ తుంపరకు కారణమును వెదకుచుండగా చనిపోయినవారు తమబంధువులతో మాటలాడుప్రయత్నము చేయుదురు. బంధువులు అది గ్రంహించలేరు. బ్రతికియుండినపుడు