Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

ఆత్మవిచారము

[6 వ

ముచేత అపూజ్యులైనవారలనుగూడ పూజ్యులని చాటించుచు, మదముచేత శ్రేష్ఠులుకానివారలనుకూడ శేష్ఠులని సమ్మానించి యితరులనుకూడ తనవలెనే సమ్మానించునట్టు చేసియు, ఈ మంత్రములను ఆవర్తిచేసి ఈ దేవతను తృప్తిపరిచి మహానిధులను సంపాదించెదను, ఈ మంత్రములను జపించి స్త్రీవశ్యము మొదలగు సంతోషదాయకములైన ఫలముల ననుభవించెదను, శ్మశానముల యందు ఉండి తాంత్రికవామమార్గపూజలను చేసి ఇతరులకు బాధకరములైన సిద్ధులుపొందుదును, కామ మొక్కటే పురుషార్థము అని అనేకులకు కంటకులుగానుందును అని దంభమోహమదములను అభ్యసించుదురు. మరియు తమ శరీరములయందును ఇతరులశరీరములయందును వసించియుండు పరమేశ్వరుని ద్వేషించి భగవదాజ్ఞలైన శాస్త్రవాక్కులను ఉల్లంఘించుదురు.

ఇతరులచేత చంపబడినవారికి అకాలమరణము సంభవించినది. ఇదే విధమున దైవవశముగా నకాలమరణమునకు పాత్రులైన వారందరును ఆస్ట్రల్ ప్ళేనుయొక్క ఏడవ సబుప్ళేనునందు నిద్రించి యుందురు. మనఃపూర్వకముగా జీవహత్యచేసికొనినవారికిని అకాలమృత్యువునకు పాత్రులైనవార్లకును వ్యత్యాసము ఏమి అనిన అకాలమృత్యువునుచెందినవారలు నిద్రించుచుందురు, తెలిసి జీవహత్యచేసికొనినవారు వ్యాకులము అను మనోవ్యధ చెందుచుందురు.

ఈ లోకమందైనను పరలోకమందైనను తప్పులుచేసిన వార్లకు దండనవిధించుటయొక్క ఉద్దేశ మేమనగా తప్పులుచేయు స్వభావము మారుటయే. మహానికృష్టములైన పాపములు చేసిన వారలయొక్క కామమయశరీరములయందు మహాముతకయైన