Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా. 6

సంసారచక్రము

241


అనేక చిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః ।
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే౽శుచౌ ॥ 16 ॥
అహంకారం బలం దర్పం కామంక్రోధం చ సంశ్రితాః ।
మా మాత్మపరదేహేషు ప్రద్విషన్తో౽భ్యసూయకాః ॥ 18 ॥

(శ్రీమద్భగవద్గీత,16 ఆధ్యా)


ఆసురసంపత్తిగల మూఢులు జగత్తునకు కారణమైన ఈశ్వరుడు లేడని నమ్మి జగత్తు తనంతట తానే కలుగుచున్నది అందురు. ఆడుదియుమగవాడును గలిసినందువలన లోకము కలిగినది అందురు. ఇంద్రియగోచరములుకాని వస్తువులు లేవని చెప్పుచు, స్వర్గము నరకము అనునవి లేవనుచు, లోకక్షోభ కలుగజేయుకార్యములను చేయుచు, ఇతరులచేత కూడ చేయించుచు, ఎంతకష్టపడినను తృప్తిపొందించుట కసాధ్యమైన దురాశగలవారలై, తమ్ము నందరు గొప్పవాండ్రని మన్నించవలెనని తమను మించిన వేష భాషలుగలవారలై, "మాకు గదా యిట్టి అదృష్టము సంభవించె" నని దురభిమానము గలవారలై, అన్నియు తమకే తెలియునను నవివేకముతో కేవల కించిత్కాలికఫలముల నుద్దేశించి క్షుద్రదేవతలను పూజించి, మద్యము మాంసము మొదలగు ఆహారములను మెక్కి అధోగతి చెందుదురు. అశక్యములగు విషయములను అనుభవించు కోరికను కలిగించు ఆశాపాశములచే లెక్కలేనన్ని విధములగా బంధింపబడి, తమకామితార్థముల ననుభవించుటకుగా అన్యాయముచేత ద్రవ్యార్జనచేయుచు, అవివేకముచే నిరంతరము విషయానుభవమునందే కాలహరణము చేయుచు, మితిలేనిపాపమును కూడపెట్టుకొని నరకములందు పడుదురు. దంభముచేత నధార్మికములైన క్రియలనుకూడ ధార్మికక్రియలని వాడుచు, మాన