Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

ఆత్మవిచారము

[6 వ

దురాత్ములు చేయు పాపములు అనేకములు. ప్రతిపాపమునకును పైవివరించిన ప్రకారము భువర్లోకపు దేవతావర్గము అ యా పాపమునకు అన్వయించునటుల మనోవ్యధల నిచ్చి పాపము చేసినవానికి పాపభీతి కలుగునట్టు చేయుదురు. ఈ విషయమును గురించి యింతకంటె నధికముగా వ్రాయుటకు ఈ పుస్తకమునందు సాధ్యము కాదు. గ్రంథబాహుళ్యమగును.

కామలోకమునందలి యీ భాగమునందు మరియు ననేక విధములైన దుష్కార్యములను చేసినవారుందురు. 1. అత్యంతవ్యభిచారాసక్తికలవారు, 2. తాగుపోతులు, 3. మహాక్రూరస్వభావముగలవారు, ఇట్టి దుస్స్వభావముగలవారు ఇక్కడ ఉందురు. ఇక్కడ ఉండు మరికొందరు ఎవరంటే, జీవహత్యచేసికొనినవారు. భూలోకమందు శ్రమలను తప్పించుకోవలెనని కొందరు జీవహత్య చేసికొందురు. తనకు ఇతరులయొక్క తప్పులు తెలిసియుండి ఆ తప్పులు చేసినవారి విషయమై న్యాయస్థానమునందు విచారణ జరుగుచుండగా తనను సర్కారువారు సాక్షిగా కోరితే తనకు తెలిసిన సంగతులను చెప్పితే తప్పుచేసినవారికి దండన కలుగు రీత్యా అవమానము సంభవించు నని కేవల పరోపకారబుద్ధితో తాము జీవహత్యచేసికొని ఆ రీత్యా మానవంతులమానమును కాపాడువారు కొందరు. వీరును జీవహత్య చేసికొనినవారే. సాధారణముగా జీవహత్య చేసికొనినవారు ఏ విధముగా మన్యోవ్యధను అనుభవింతు రనగా తాము చేసినతప్పును ప్రతినిమిషమందును చింతించి అందువలన కలుగబోవు అవమానమును చింతించి చింతించి ఆ యవమానమును తప్పించుకొనుటకుగా తాను చేసిన జీవ