అధ్యా. 6
సంసారచక్రము
237
తడవలు నిశ్చయించుకొని చంపుట అను స్వభావమును పోగొట్టుకొనును.
నరకబాధలను మన పురాణములలో అనేకవిధములగా వర్ణించియున్నారు. ఆవర్ణనలన్నియు మహాభయమును పుట్టించునవి. ఇట్టి పాపమునుచేసిన యెడల ఇట్టి దండనయని విని భయపడి పాపములను చేయకుండవలయునను నుద్దేశముతో చెప్పి రేమో. ఐతే మనోవ్యధ, భయము అను దండనలు ఎడతెగక అనేక సంవత్సరములకాలము అనుభవించుటకంటె కుంభీపాకము, రౌరవము మొదలగు నరకములయందు పాపాత్ములు అనుభవింతురు అని చెప్పిన దండనలు అతి సులభములు.
ఇదేవిధముగా సోలిగాడు భూలోకమందుండినపుడు చేసిన ఒక్కొక పాపమునకు ఫలముగా దండనలను మనోవ్యధరూపముగా ననుభవించును. 232 వ పుటయందు "తత్రైవ సూక్ష్మ కర్మణాం భోగో భవతి, స చ దుఃఖరూప;" అని చెప్పి దీనినే నరకము అని వ్యవహరింతురు అని చెప్పియున్నది. మానహీనులను దెబ్బలతో దండించిన గాని వారికి తమను దండించినారని తెలియదు. మానవంతులకు అవమానకరమైన యొక్క తిట్టు చాలును. మన పురాణములయందు వర్ణించిన నరకబాధలన్నియు శరీరమునకు శ్రమ కలుగచేయుద్వారా బుద్ధికుదురునట్టు చేయునవి. అట్టి దండన శుద్ధమోటుమనుష్యులను భయపరుచును. మానవంతులకును కొంతమట్టుకు తెలివిగలవార్లకును మనస్సునకు కలుగు బాధలు శరీరమునకు కలుగు బాధలకన్న నధికముగా బుద్ధిని కుదుర్చును.