Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా. 6

సంసారచక్రము

233

ప్రేతకు దహనము అయిన మరునాడు సంచయనము జరుగును. నిత్యవిధి జరుగును. ఈ లోపల స్థూలదేహమును పోగొట్టుకొనిన జీవాత్మయొక్క కామమయశరీరమునందు కొన్ని మార్పులు ఏర్పడును. కామమయశరీరము ఆస్ట్రల్ ప్ళేనుకు సంబంధపడినది. భూలోకము అను ఫిజికల్ ప్ళేనునందు ఏడు విధములైన ప్రకృతిభాగములున్నట్టే భువర్లోకమైన ఆస్ట్రల్ ప్ళేనునందు కూడ ఏడు విధములైన ప్రకృతిభాగములున్న వని 118 వ పుట యందు చెప్పబడియె. ఆస్ట్రల్ బాడీ అని మారుపేరుగల కామమయశరీరము ఆస్ట్రల్ ప్ళేనుయొక్క ఏడు సబుప్ళేనుల ప్రకృతివల్లకట్టబడినది అనియు చెప్పబడియె. కామమయశరీరపు అణువులన్నియు కామమయశరీరముయొక్క ఎల్లకు లోబడి సదా సర్వకాలములయందును ఉండినచోటనుండకయే తమ యిష్టానుసారముగా కలిసి సంచరించుచుండునని 120 వ పుటయందు చెప్ప బడియె. జీవాత్మ స్థూలశరీరమునందు వసించియుండు కాలమునందు ఈ విధముగా అణువుల మేళనము అగుచుండును. అగ్నిపైన యొక పాత్రలో జలమును ఉంచి తెర్లపెట్టితే ఆ జలముయొక్క అణువులు నాట్యముచేయునుగదా. ఆ పాత్రయొక్క అడుగుభాగమునందుండిన నీటియణువులు నీటిపైభాగమున కెగియును. ఆ జలముయొక్క అణువులలో నొక యణువైనను తానున్న స్థలమందుండదు గదా. అధే విధమున ఆస్ట్రల్ బాడీయొక్క అణువులు ఎల్లపుడు స్థలము మారుచుండును. దహనము అయిన పిమ్మట రెండుదినములవరకును స్మారకములేక నిద్రపోయినట్టు జీవాత్మలు ఉందురు. తరువాత మేలుకొన్నప్పటికి ఆస్ట్రల్ బాడీలోని స్థూలాతిస్థూలములైన