228
ఆత్మవిచారము
[6 వ
యెడల అనేక దుఃఖములు కలుగును. కనుక మరణముచెందిన స్థూలశరీరము అగ్నికి నియ్యబడును.
ఒక ఆక్షేపము కలుగవచ్చును. జీవాత్మ స్థూలశరీరమును ప్రవేశించుటకు ఇచ్ఛయించితే ఆశరీరమును కాల్చి భస్మముచేయకయే భూస్థాపనచేయుసంప్రదాయము ననుసరించి మట్టిక్రింద దాచి యుంచితే జీవాత్మ ఆ శరీరములో ప్రవేశించితే మాత్రము ఏవిధము ఆ శరీరమును మట్టిక్రిందినుండి పైకితేగలడు. పైకి తెచ్చినప్పటి కేకదా అందువల్ల ననర్థముకలుగును అనవచ్చును. మట్టిక్రింద స్థాపించబడినపుడు స్థూలశరీరము ఉపయోగించుటకు సాధ్యముకాదు. నిజమే. ఐనను 122 వ పుటయందు చెప్పినప్రకారము స్థూలశరీరము భూస్థాపనయైయుండగా ఛాయాశరీరము ఆ శరీరమునకు సరిగా పైన ఆకాశమందు తేలుచుండును. స్థూలశరీరమును ఉపయోగించుటకు వీలులేకపోయినందున జీవుడు ఛాయశరీరములో ప్రవేశించి ఆ శరీరమునే స్థూలశరీరమువలె నుపయోగించును. 226 వ పుటయందు "స్థూలదేహాభావేపి స్థూలసదృశం ఏకం లింగశరీర మధితిష్ఠతి । సో పి స్థూలాంతర్గతమేవ” యని మొదలుగాగల వచనములవల్ల ఆ ఛాయాశరీరముతో మాత్రము అత్యంతప్రియములైన స్థూల విషయములను అనుభవించుటసాధ్యము. విషయములను అనుభవించితే యేమి చెడుపు అని ఆక్షేపించవచ్చును. ఇది జీవాత్మయొక్క పురోవృద్ధికి చాలచెడుపు. కనుక స్తూలదేహమును భూస్థాపనచేయక దహనము చేయుటవల్ల ఛాయాశరీరముకూడ నశించును. ఈ కష్టములన్నియు కామాతురులైన జీవాత్మలకే గాని కొంచెము వైరాగ్యమును సంపాదించిన వారికి కలుగదు.