Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

ఆత్మవిచారము

[6 వ

ఎపుడు స్థూలశరీరము మందావస్థను (ముదుసలితనమును) చెందునో అపుడు జీవుడు స్థూలమును విడిచి సూక్ష్మములోనికి వెళ్లును. ఈ చర్యకు మరణము అని పేరు. మరణానంతరము జీవుడు యమాలయమునకు పోవును అను స్మృతివాక్యమునకు ఇదే అర్థము. యముడు అంటే నివృత్తి అని యర్థము. అతని ఆలయము అనగా సూక్ష్మదేహయు. ప్రవర్తనను అనుసరించియే కదా నివర్తన. స్థూలదేహమందుండి విషయవ్యాప్తిగలిగియుండిన స్థితికి ప్రవర్తన యని యర్థము. స్థూలదేహస్థితిముగియగానే ప్రవర్తన, ముగియును. నివర్తన యారంభించుననగా యమాలయము అను పేర వ్యవహరింపబడు సూక్ష్మదేహములో నిలుచును. సూక్ష్మదేహవాసియైన జీవుడు కామలోకమం దుండును.

సూక్ష్మస్థూలయో ర్నిత్యసంబంధా త్సూక్ష్మదేహస్థ జీవః కామలోకాదాగంతుమిచ్ఛతి । యది చేత్ స్థూలశరీరస్య వర్తమానతా, తర్హి మృతే౽పి స్థూలదేహే హ్యేత దాగమనం పూర్వ మిష్టపదార్థానాం పరిచిన్తనం తస్య కామలోకేపి భవతి । అత్యంతమిష్టతయా చా గత్యతాదృశస్థూలదేహేన తేషాం పదార్థానాం భోగసాధనత్వం భవతి । తత్రాప్యనేకే చ దోషాః సంభవంతి । తద్వారణాయ హి చాస్య స్థూలదేహస్య అగ్నౌ ప్రక్షేపః । స్థూలదేహా భావేపి స్థూలసదృశం ఏకం లింగశరీర మధి తిష్ఠతి । సోపి స్థూలాంతర్గత మేవ । తత్ర స్థితౌ సత్యామపి పదార్థభోగో భవతి । ఈప్సితతమానాం తద్వారా ప్రాప్తి రితి విజ్ఞేయం ।

మరణాత్పూర్వము అనేక సంవత్సరములు అనగా నాయుష్కాల మంతయు స్థూలశరీరమునకు కామమయశరీరమునకు ఐకమత్యము విడనాడకయుండియున్నందున పరస్పరస్నేహము అతిబలము.