అధ్యా. 6
సంసారచక్రము
225
జీవాత్మను మనము చూడలేము, కాని మన చర్యలనన్ని ఆ వస్తువు (జీవాత్మ) చూచును. బంధువులరోదనము మొదలగు సాహసములకు కారణము తెలియక దిగ్భ్రచెందును. తన బంధువులు ఏల ఏడ్చేదరని అడుగును. ఆ మాటలు మనకు వినరావు. ఏలనంటే కర్మేంద్రియమైన వాగింద్రియము అచట నేలపడియుండు శవమునందున్నది. కాని ఛాయాశరీరమందుండు ఇంద్రియముతో వైఖరీవాక్కు నుచ్చరించుటకు సాధ్యముగాదు. జీవాత్మ ఏవిధముగానైనను మనతో మాటలాడి మనము ఏడ్చుచున్నందుకు కారణమేమని యడుగవలెనని యెన్ని విధముల మనలను హెచ్చరించినను మనకు తెలియక పోవును. మనలకు సూక్ష్మదృష్టి లేనిది కారణము. కనుక తాను విసికి జీవాత్మ ఒక మూల చేరి తనకు ఇన్ని సంవత్సరములకాల ముపయోగముగానుండిన శరీరము తనకిపుడుపయోగించనందుకుగా దుఃఖించుచుండును.
దహనము
ఇంతలో నిరుగింటివారు పొరుగింటివారందరును గుంపులుకూడి శవమును కట్టి శ్మశానభూమికి తీసుకొనివెళ్లుదురు.
తస్మాన్మరణం హి స్థూలే తత్పరిత్యజ్య జీవస్య నూక్ష్మశరీరాభిగమన రూపకార్యకరణ మేవ । అత ఏవ “మృతే సతి యమాలయం గచ్ఛతి" ఇత్యాది ప్రవచనం । యమో హి నివృత్తిః । తదాలయ స్సూక్ష్మదేహః । నివర్తనం హి ప్రవర్తనన్యైవ భవతి । యదిదం ప్రవర్తనం స్థూలదేహస్థితి రూపం । తతో నివృత్య అన్యత్ర గచ్ఛతీతి విజ్ఞేయం । సోయం యమాలయో హి సూక్ష్మదేహః । తస్మిన్ జీవస్య స్థితిః । స్థిత్వా కామలోకాదికే నివసతి జీవః ఇతి విజ్ఞేయం ॥