అధ్యా. 6
సంసారచక్రము
221
యిక రాబోవు జన్మమునందు సత్కార్యములనే చేయుదును అని నిశ్చయించుకొనును. అయినను గర్భమును వదిలి నేలపడగానే ఆనిశ్చయములన్నియు మరిచి పోవును. మరల మరణకాలమందు జీవాత్మ ఒక నిమిషకాలము సమాహితచిత్తుడై జన్మమెత్తినది మొదలు ఆ క్షణమువరకును తాను చేసిన సత్కార్యములు, దుష్కార్యములు, అన్నిటినిని పరీక్షించును. అతని సహాయమునకుగా ఆ జీవితకాలమందు జరిగిన ముఖ్యాంశములన్నియును అతని యెదుట నిలుచును. ఆ కార్యములనెల్ల పరిశీలించి ఇన్ని మంచివి, ఇన్నిచెడ్డవి, అని తెలిసికొని మంచికార్యములనే చేయుదును, చెడ్డకార్యములను చేయను, అని యొక ప్రతిజ్ఞ చేసికొనును. ఈ పరీక్షాకాలము జీవాత్మకు పురోవృద్ధికారణము. అప్పట్లో అతనిని ఎవరును తొందరచేయకూడదు. శాంతముగా నుండునట్లు ఒంటరిగా విడిచిగాని లేక చుట్టును ఉండువారలు నిశ్శబ్దముగా నుండునట్లేర్పాటుగాని చేయవలయును. "నాయనా నాకేమిగతి” అను మొదలగు ఏడ్పులవల్ల జీవాత్మయొక్క చరమస్థితియందు అతనికి కావల సిన శాంతమును ఇయ్యక అతనియొక్క కార్యమునకు హానియును చేయుదురు. ఇందువలననే చావనుసిద్ధముగానుండువారికి కర్ణమంత్ర శ్రవణము, నామస్మరణము మొదలగు సచ్ఛ్రవణములు జరిగించి శాంతమును ఇయ్యవలెనని ఆచారము.
మరణము నిద్రతో సమానము
ప్రతినిత్యమును మనము పగట్లో హవ్యాసములవల్ల దేహమును అలిపించుకొని రాత్రియగునప్పటికి నిద్రను చెందుదుము కదా.