Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా. 6

సంసారచక్రము

219

ఈ పంజరము బీరకాయపీచువలె ఎక్కడమొదలు ఎక్కడ కొన అని కనుక్కొనుటకు అసాధ్యమగునట్టుండును. "బుద్ధిక్ ప్ళేనుయొక్క ప్రకృతివల్ల ఏర్పడియుండును. "తిర్యగూర్ధ్వ మధః” అనినప్రకారము పైకి క్రిందికి ప్రక్కలకు అంతయు నావరించి యుండును. దేహబీజములనన్నిటిని ఆవరించియుండును. "తంతు పంజరమధ్యస్థ లూతికా యథా భ్రమతి తథా అసౌ తత్ర ప్రాణశ్చరతి”. ప్రతిదేహమందును ఆ దేహముయొక్క ప్రాణము ఆ యా దేహముయొక్క నాడీపంజరమునందు సంచరించుచునుండును. స్థూలశరీరముయొక్క భూతసూక్ష్మము భూలోకమునందు మాతృగర్భమునందు చేరగానే ఆ భూతసూక్ష్మమునుండి పై చెప్పిన విద్యుల్లేఖవంటి సూత్రము బయలువెడలి శిశుశరీరమును కడవరకును అల్లుకొని స్థూలశరీరమునందలి ప్రాణశక్తులు సంచరించుటకు మంచి వలవలె విస్తరిల్లి పంజరమువలె ఏర్పడును. "దేహేస్మిన్ జీవః ప్రాణారూఢో భవతి" అని యుపనిషద్వాక్యము. మరియు "హృదయాకాశే మహోజ్జ్వలా జ్ఞానరూపా భవతి.” “యోగకాలే చా నేన అగ్నినా బ్రహ్మరంధ్రం స్ఫురతి” అని యుపనిషద్వాక్యములు. ఈ పంజరమును అనుసరించి కుండలినియు, చతుర్దశముఖ్యనాడులును, "గుదస్య పృష్ఠభాగే వీణాదండాశ్రితా మూర్ధ పర్యంతం బ్రహ్మరంధ్రే చ విజ్ఞేయా వ్యక్తా సూక్ష్మా వైష్ణవీభవతి” అను వైష్ణవీ అని పేరుగల నాడియు "ఏతాను చతుర్దశనాడిష్వన్యా నాడ్య స్సంభవంతి" అనిన యితరనాడులు అనేకములును పుట్టును.

యథా౽శ్వత్థాది పత్రం సిరాభిర్వ్యాప్తం ఏవం శరీరం నాడీభిర్వ్యాప్తం ।. దశవాయవ స్సర్వాసు నాడీషు చరంతి । సర్వగాత్రేషు