216
ఆత్మవిచారము
[6 వ
శాస్త్రములనిబంధనల సనుష్ఠించువారును గనుక ఆచార్యులవా రనబడుదురు. ఉపనయనం (ఉప+నయనం) అనగా సమీపమునకు పిలుచుకొనివెళ్లుట. ఈ క్రియ సద్గురువులవారి సహాయము వల్లనే గాని వేరు విధమున జరుగుట లేదు. జీనాత్మయొక్క దీర్ఘ కాల అనుభవములో సుఖములు దుఃఖములు ఇవి ఒకటిని విడిచి యొకటి యుండదు అని తెలిసికొనియున్నాడు.
సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం ।
ద్వయమేతద్ధి జంతూనా మలంఘ్యం దినరాత్రివత్ ॥
సుఖమధ్యె స్థితం దుఃఖం దుఃఖమధ్యే స్థితం సుఖం ।
ద్వయమేతద్ధి జంతూనాం ప్రోచ్యతే జలపంకవత్ ॥
(అధ్యాత్మరామాయణము)
ద్వంద్వాతీతుడుగా బ్రతుకవలెనంటే జీవాత్మకు జ్ఞానోదయము కావలెను. జ్ఞానోదయమునకు సహాయులు ఆచార్యులవారు. వారి సమీపమునకు పోవుట అను ప్రయత్నమునకు ఉపనయనము అని పేరు. ద్వంద్వాతీతానుభనము బ్రహ్మజ్ఞానమువల్లనే సాధ్యము. బ్రహ్మజ్ఞానము సంపాదించు ఆచారమందుండువాడు
"బ్రహ్మచారీ”. బ్రహ్మచర్యవ్రతము జరుపుటకుగా వ్రతబంధము ఉపవీతము అను జందెము. వటువు తన మనస్సునందు చేసికొనిన ప్రతిజ్ఞను నడుపగలను, తప్పుటలేదు, అని చేసికొనిన నిశ్చయమును సూచించునది యజ్ఞోపవీతము. బ్రహ్మచర్యము రాగానే ఒక యజ్ఞము చేతురు. ప్రకృతకాలమందు సాధారణహోమము. ఈ యజ్ఞమునకు “సర్వే మహర్షయః ఋషయో మహాత్మానో బ్రాహ్మణా యోగిన శ్చ దేవాశ్చ యజ్ఞ సమాగచ్ఛంతి । ఆగత్య చ యథాత్మక